కర్కాటక రాశి వారు భావోద్వేగ, సున్నిత స్వభావం కలిగి ఉంటారు. కానీ వీరు నిర్ణయాలు తీసుకునే బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తులు ఇతరుల భావాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యక్తులు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తారు. వారి తెలివితేటలతో వృత్తి జీవితంలో విజయం సాధిస్తారు. చుట్టూ ఉన్నవారు వీరితో ఉండేందుకు ఇష్టపడతారు.