వృత్తి, వ్యాపారాల్లో నిరాశ తప్పదు . దైవ భక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలం. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. ఇంటా బయట గంధరగోళ పరిస్థితులు ఉంటాయి.
212
వృషభ రాశి ఫలాలు
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
312
మిథున రాశి ఫలాలు
ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేతిలో డబ్బు ఉండదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
కుటుంబంతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
512
సింహ రాశి ఫలాలు
సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఆర్థిక లాభాలుంటాయి.
612
కన్య రాశి ఫలాలు
కొత్త వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు వస్తాయి.
712
తుల రాశి ఫలాలు
మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు వస్తాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలుంటాయి.
812
వృశ్చిక రాశి ఫలాలు
కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.
912
ధనుస్సు రాశి ఫలాలు
రియల్ ఎస్టేట్ లో లాభాలు వస్తాయి. ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
1012
మకర రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపేస్తారు. బంధు మిత్రులతో అకారణంగా కలహాలు వస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు కలిసిరాదు.
1112
కుంభ రాశి ఫలాలు
మిత్రులతో అకారణంగా కలహాలు వస్తాయి. పిల్లల చదువు విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది.
1212
మీన రాశి ఫలాలు
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగుతాయి. కొత్త వ్యాపారాల్లో సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.