Holiday : యోగా డే స్పెషల్ హాలిడేస్ ... తెలుగు విద్యార్థులకు ఈ మూడ్రోజులు సెలవులే

Published : Jun 19, 2025, 10:04 PM ISTUpdated : Jun 19, 2025, 10:18 PM IST

యోగా డే సందర్భంగా తెలుగు విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అయితే ఈ సెలవులు కేవలం ఇక్కడి విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి. ఇంతకూ ఆ ప్రాంతమేది? ఎందుకు ఇన్నిరోజులు సెలవు ఇస్తున్నారు? ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
15
విశాఖ విద్యార్థులకు వరుసగా మూడ్రోజులు సెలవులు

Yoga Day Holidays : భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాను యావత్ ప్రపంచం గుర్తించింది.. అందుకే జూన్ 21న అంతర్జాతీయ యోగా డే జరుపుకుంటున్నాం. గత పదేళ్లుగా జరుపుకుంటున్న యోగా డే ఒకెత్తు... ఈసారి జరుపుకుంటున్న యోగా డే మరో ఎత్తు. ఈసారి యోగా డే తెలుగు ప్రజలకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈసారి తెలుగు గడ్డపై అట్టహాసంగా యోగా డే వేడుకలు జరుపుకోబోతున్నాం. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే యోగా డే వేడుకలకు హాజరవుతున్నారు.. దీంతో యావత్ దేశం ఇటువైపు చూస్తోంది.

అంతర్జాతీయ యోగా డే కోసం ఇప్పటికే విశాఖపట్నంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నారు. బీచ్ సిటీ విశాఖ ఈ రెండ్రోజులు యోగాసనాల కోసం సిద్దం అవుతోంది. నగర ప్రజలతో స్కూళ్లు, కాలేజీ విద్యార్థులను కూడా ఈ యోగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తోంది ప్రభుత్వం. అందుకోసమే విశాఖపట్నంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ రెండ్రోజులు (జూన్ 20, 21) అంటే శుక్ర, శనివారం సెలవు ప్రకటించారు. తర్వాత ఎలాగూ ఆదివారమే కాబట్టి విద్యార్థులకు మూడ్రోజులు యోగా హాలిడేస్ వచ్చాయి.

25
విశాఖలో యోగా డే హాలిడేస్ ప్రకటన

యోగా డే వేడుకల సందర్భంగా విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవు ఇస్తున్నట్లు విశాఖపట్నం డిఈవో ప్రేమ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

ఈ రెండ్రోజులు విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని విద్యాసంస్థలను విద్యా శాఖ ఆదేశించింది. విశాఖపట్నంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ ఈ శుక్ర, శనివారం స్టూడెంట్స్ కి తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఆదివారం సెలవుతో కలిపితే స్టూడెంట్స్ కి మూడ్రోజులు హాలిడేస్ వస్తున్నాయి. 

35
యోగా డే వేడుకలకు సిద్దమైన విశాఖపట్నం

కూటమి సర్కార్ ఈసారి యోగా డే వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించే యోగా డే వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో యోగా డే వేడుకల ఏర్పాట్లను మంత్రుల బృందం దగ్గరుండి చూసుకుంటోంది... ఇక రేపు(శుక్రవారం) చంద్రబాబు విశాఖకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తారు.

విశాఖ బీచ్ లో దాదాపు ఐదులక్షల మందితో ఈ యోగా డే వేడుకలు జరగనున్నాయి... ఇందుకోసం ఇప్పటికే ఆర్కే బీచ్ ను పోలీసులు, భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, ఇతర ముఖ్య నాయకులు కూర్చునేలా భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విఐపి వెహికిల్ పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

రేపట్నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు మరింత ఎక్కువ కానున్నాయి... భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందిపడే అవకాశాలున్నాయి. అలాగే యోగా డే వేడుకల కోసం విద్యార్థులకు సంసిద్దం చేయాల్సి ఉంది. అందువల్లే యోగా డే కు ముందురోజు అంటే శుక్రవారం, యోగా డే రోజు అంటే శనివారం రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

45
మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20న అంటే శుక్రవారమే భువనేశ్వర్ నుండి విశాఖపట్నం చేరుకుంటారు... రాత్రి తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. తర్వాతిరోజు (జూన్ 21న) యోగా డే సందర్భంగా ఉదయం 6.30 గంటల నుండి 7.45 వరకు ఆర్కే బీచ్ లో జరిగే యోగాంధ్ర వేడుకల్లో పాల్గొంటారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు నాయడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ముఖ్య నాయకులు, ప్రజలు యోగసనాలు వేస్తారు. ఈ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉదయం 11.50 గంటలవరకు ప్రధాని మోదీ విశాఖపట్నంలోనే ఉంటారు. తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో డిల్లీకి పయనం అవుతారు. గత నెల మేలో ప్రధాని అమరావతిలో పర్యటించారు... ఇప్పుడు జూన్ లో విశాఖపట్నం వస్తున్నారు. ఇలా ప్రధాని మోదీ ఆంధ్ర ప్రదేశ్ లో వరుస పర్యటనలు చేపడుతున్నారు.

55
తెలంగాణలో యోగా డే వేడుకలు

11వ అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని తెలంగాణలో కూడా వేడుకలు నిర్వహించనున్నారు. రేపు(శుక్రవారం) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో జరిగే యోగా డే ముందుస్తు వేడుకల్లో పాల్గొంటారు. ఇక జూన్ 21న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో యోగా డే వేడుకలు జరపాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 'యోగా సంగమ్' నిర్వహిస్తున్నారు... తెలంగాణలో కూడా శనివారం ఉదయంం 6.30 నుడి 7.45 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్ని ప్రభుత్వం సూచించింది.

ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు యోగా డే సందర్భంగా విద్యార్థులకు యోగాసనాలు వేయిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యోగా గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసేలా ఈ కార్యక్రమాలను చేపడుతున్నాయి. చిన్నారులు కూడా యోగాసనాలను ఎంజాయ్ చేసేలా కార్యక్రమాలను రూపొందించారు. పిల్లలు, పెద్దలు అందరూ యోగా డే సందర్భంగా యోగాసనాలు వేసేందుకు సిద్దం అవుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories