Wine Shop: ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్‌కు గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మందు బాబులకు ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. తెలుగు రాష్ట్రాల్లో వైన్స్ సమయంలో మార్పు చేస్తూ ప్రకటన చేశారు.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకునే ప్లాన్‌లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మందుబాబులకు ఊరటనిచ్చే నిర్ణయాలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చాయి. పనివేళల పొడిగింపుతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
26
ఏపీలో ఆల్కహాల్ షాపుల పనివేళల్లో మార్పులు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 రోజు, జనవరి 1 రోజు రాత్రి 12 గంటల వరకు ఆల్కహాల్ విక్రయాలకు అనుమతి ఇచ్చింది. సాధారణ రోజుల్లో ఉండే సమయాలకు భిన్నంగా ఈ రెండు రోజులకు మాత్రమే ఈ సడలింపు వర్తించనుంది.
36
బార్లు, హోటళ్లు, పర్మిట్ రూమ్స్‌కు అనుమతి
ఈ సడలింపు వైన్ షాపులకే పరిమితం కాదు. బార్లు, ఇన్ హౌస్ లైసెన్సులు, పర్మిట్ రూమ్ లైసెన్సులు ఉన్న కేంద్రాలు కూడా రాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే హోటళ్లకు కూడా ఇదే విధంగా అనుమతి మంజూరు చేశారు. న్యూ ఇయర్ వేడుకల రెండు రోజుల వరకే ఈ వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైన్ షాపుల పనివేళల పొడిగింపుపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ గోయల్ ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటకులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా న్యూ ఇయర్ వేడుకలు జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
56
లా అండ్ ఆర్డర్‌పై కఠిన హెచ్చరిక
న్యూ ఇయర్ వేడుకల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు సహించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రోడ్లపైకి వచ్చి గందరగోళం సృష్టించినా, పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
66
తెలంగాణలోనూ ఇదే తరహా సడలింపు
ఇక తెలంగాణలో కూడా డిసెంబర్ 31 రోజు రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లకు అనుమతి ఇచ్చారు. బార్లు, క్లబ్స్, ప్రత్యేక ఈవెంట్లకు మాత్రం అర్థరాత్రి 1 గంట వరకు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.