Cyclone Grant : హిందూ మహాసముద్రంలో గ్రాంట్ తుపాను కొనసాగుతోంది… దీని ప్రభావంతో కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి… మరి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం సంగతేంటి..?
IMD Cold Wave Alert : హిందూ మహాసముద్రంలో తుపాను ఏర్పడింది... దీనికి 'గ్రాంట్' అని పేరుపెట్టారు. ఈ తుపాను ప్రభావం ఆస్ట్రేలియాపై ఎక్కువగా ఉంది... ముఖ్యంగా కోకోస్ దీవుల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక భారీ అలలు, బలమైన ఈదురుగాలులతో తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది.
అయితే ఈ గ్రాంట్ తుపాను ఎఫెక్ట్ తో భారీ మేఘాలు తయారవుతున్నాయి... ఇవి ఇండియావైపు వస్తే చలి తీవ్రత తగ్గేది. కానీ ఈ మేఘాలు దిశ మార్చుకుని ఇండియా తీరానికి దూరంగా వెళుతున్నాయి... కాబట్టి చలి కొనసాగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
26
తెలుగు రాష్ట్రా ల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే..
ఇక తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగురోజులు చలి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. డిసెంబర్ ఆరంభంనుండి చలి తీవ్రత పెరిగింది... ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతూ ప్రస్తుతం చలిగాలులు తారాస్థాయికి చేరాయి.. దట్టమైన, పొగమంచు కురుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో కొన్నిచోట్ల అత్యల్పంగా 3, 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయంటే చలి ఏస్థాయిలో ఇరగదీసిందో అర్థం చేసుకోవచ్చు.
36
ఆంధ్ర ప్రదేశ్ పై చలి పంజా
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో చలి చంపేస్తోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు మిగతా ఏజన్సీ ప్రాంతాల్లో గజగజలాడించే చలి ఉంది. అరకు, పాడేరు, ముంచంగిపుట్టు వంటి ప్రాంతాల్లో 6-7 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఇక కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి... దట్టమైన పొగమంచు కురుస్తూ చలి ఇరగదీస్తోంది. కొబ్బరి చెట్లు, పచ్చని వరిచేళ్లలో పొగమంచు కురిసే సీన్ కొన్ని కోనసీమ పల్లె అందాలను రెట్టింపు చేస్తోంది.
ఇక తెలంగాణలో కూడా చలిగాలులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే కొద్దిరోజుల క్రితంవరకు చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి... కానీ ప్రస్తుతం ఆదిలాబాద్ లో మాత్రమే 7.2 డిగ్రీలున్నాయి. మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత కాస్త తగ్గింది. మెదక్ లో 10.2, హన్మకొండలో 11.5, రామగుండంలో 12, నిజామాబాద్ లో 13.1, భద్రాచలంలో 14.5, ఖమ్మంలో 14.4, నల్గొండలొ 14.4, హహబూబ్ నగర్ లో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
56
హైదరాబాద్ టెంపరేచర్స్
హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగి నగరవాసులకు కొంచె ఊరట లభించింది. కానీ శివారులో చలిగాలులు తీవ్రత కొనసాగుతోంది. జిహెచ్ఎంసి పరిధిలోని పటానుచెరులో ఇంకా 8.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బేగంపేటలో 13.6, హకీంపేటలో 13.4, దుండిగల్ లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి... మొత్తంగా హైదరాబాద్ లో సగటు ఉష్ణోగ్రత 13.6 గా ఉంది.
66
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే
ప్రాంతాలవారిగా చూసుకుంటే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానిలో అత్యల్పంగా 7.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే సంగారెడ్డి జిల్లా కోహీర్ 7.8, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ 8.9, ఆదిలాబాద్ జిల్లా గడిగూడ 9.5, కామారెడ్డి జిల్లా గాంధారి 9.6, వికారాబాద్ జిల్లా బంట్వారం 9.8 లో మాత్రమే సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. తెలంగాణలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 12.9 ఉంది.