IMD Rain Alert : మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ తెలుగు ప్రాంతాల్లో జోరువానలు

Published : Jan 05, 2026, 07:38 AM IST

IMD Rain Alert : ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు, తెలంగాణలో మళ్లీ చలిగాలులతో వాతావరణం సంక్లిష్టంగా మారనుందట. కాబట్టి తెలుగు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
16
బంగాళాఖాతంలో అల్పపీడనం

IMD Rain Alert : బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. డిసెంబర్ మొత్తం ఈ సముద్రంలో ఎలాంటి అలజడి లేదు... కానీ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే వెదర్ చేంజ్ అయ్యింది. ప్రస్తుతం శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది... ఇది బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. జనవరి 8న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

26
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావం తమిళనాడుకు ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట... ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. సరిగ్గా సంక్రాంతి సమయంలో వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు తెలుగు ప్రజలను కాస్త కంగారు పెడుతున్నాయి.

36
పొగమంచు దుప్పటి

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం చలి తక్కువగానే ఉన్నా దట్టమైన పొగమంచు కురుస్తోంది... అయితే రాబోయే రోజుల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది... అరకు, పాడేరు, చింతపల్లి, మినుములూరు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచుతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది... దీంతో ఈ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది.

46
తెలంగాణలో కోల్డ్ వేవ్స్ 2.0

తెలంగాణ విషయానికి వస్తే ఇక చలిగాలులు 2.0 మొదలవనుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇవాళ్టి (సోమవారం, జనవరి 5) నుండి మళ్లీ చల్లని గాలులు పెరుగుతాయని తెలిపారు. ఈసారి కేవలం రాత్రి, ఉదయం ఉష్ణోగ్రతలే కాదు మధ్యాహ్నం టెంపరేచర్స్ కూడా తగ్గుతాయని హెచ్చరించారు. సంక్రాంతి సమయంలో చలి పీక్స్ కు చేరుకుంటుందని... దట్టమైన పొగమంచు కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

56
తెెలంగాణలో దట్టమైన పొగమంచు

తెలంగాణలో పొగమంచు తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నాలుగైదు రోజులు ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యల్పంగా 5-10 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. మిగతా అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీల పైనే లోయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి ఉంటుందని... ఉదయం, రాత్రి వేళల్లో విపరీతమైన పొగమంచు ఉంటుందని తెలిపింది. నగరంలో కనిష్ఠంగా 18 డిగ్రీలు, గరిష్ఠంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

66
ఈ తెలంగాణ జిల్లాల్లోనే లోయెస్ట్ టెంపరేచర్స్

నిన్న (జనవరి 4, ఆదివారం) రాష్ట్రంలో అత్యల్పంగా నల్గొండ, హన్మకొండ జిల్లాల్లో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మెదక్ లో 15.2, ఆదిలాబాద్ లో 16.2, రామగుండంలో 16.6, నిజామాబాద్ లో 17.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. హైదరాబాద్ పరిధిలోని పటాన్ చెరు ఈక్రిశాట్ లో 13, రాజేంద్రంనగర్ లో 14, హయత్ నగర్ లో 17, బేగంపేటలో 17.7, హకీంపేటలో16.8 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయని వెల్లడించింది.

Read more Photos on
click me!

Recommended Stories