IMD Rain Alert : జనవరి 26 (సోమవారం) రిపబ్లిక్ డే. ఈ జాతీయ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతాయి. అయితే కొన్నిచోట్ల ఈ వేడులకు వర్షాలు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయట.
IMD Rain Alert : వర్షాకాలంలో వానలు పడితే అది సాధారణం... అదే శీతాకాలం, వేసవికాలం కూడా వర్షాలు కురిస్తే అది అసాధారణం. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇండియాలో నెలకొంది... కాలంలో పనిలేకుండా వానలు పడుతున్నాయి. శీతాకాలం ముగిసి వేసవి మొదలయ్యే సమయంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి... దీనికి హిమపాతం, పొగమంచు తోడయ్యింది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు...రాత్రి, ఉదయం సమయాల్లో ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
26
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
వర్షాకాలం ముగిసి శీతాకాలంలో అడుగుపెట్టాకే బంగాళాఖాతంలో తుపానులు ఏర్పడ్డాయి.. ఇవి ఏ స్థాయిల్లో అల్లకల్లోలం సృష్టించాయో చూశాం. ఇప్పుడు శీతాకాలం ముగిసి ఎండాకాలం ప్రారంభమయ్యే సమయంలో బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం శ్రీలంక, తమిళనాడు సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
36
ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో వర్షాలు
ఈ అల్పపీడన ద్రోణి ఉత్తర కేరళ, అరేబియా సముద్రం వైపు ముందుకు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కూడా వాతావరణ పరిస్థితులు మారతాయి... ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో నిన్న(ఆదివారం) చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇవాళ (జనవరి 26, సోమవారం) కూడా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ వర్షాల నేపథ్యంలో రైతులు, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
56
తెలంగాణ వాతావరణం..
తెలంగాణ విషయానికి వస్తే వర్షసూచనలు లేవుగానీ ఆకాశం మేఘాలతో ఉంటుందట. ముఖ్యంగా హైదరాబాద్ లో పాక్షికంగా మేఘాలు కమ్మేసి వాతావరణం ఆహ్లాదరకంగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక్కడ ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఉంటుందని... గరిష్ఠంగా 29, కనిష్ఠంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని... ఆదిలాబాద్, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 11 నుండి 15, మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
66
జనవరి 26, 27 రెండ్రోజులు వర్షాలే..
ఇక మరో దక్షిణాది రాష్ట్రం తమిళనాడు ఇవాళ, రేపు (జనవరి 26,27) రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని ఆ రాష్ట్ర వాతావరణ విభాగం హెచ్చరించింది. తీర ప్రాంతాలతో పాటు అంతర్గత ప్రాంతాల్లో కొన్నిచోట్ల ,పుదుచ్చేరి, కారైక్కాల్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కర్ణాటకలోనూ అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని ఆ రాష్ట్ర వాతావరణ విభాగం తెలిపింది.