IMD Rain Alert: గత కొన్ని రోజులుగా విపరీతమైన చలితో ఇబ్బంది పడుతోన్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిసింది. దీంతో వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశందని చెబుతోంది.
బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు దిశ గాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ గాలుల ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
25
దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్ష సూచన
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో ఆదివారం (ఈ రోజు) చెదురుమదురు వర్షాలు కురవొచ్చు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉండగా, కొన్ని చోట్ల స్వల్పం నుంచి మోస్తరు వర్షం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
35
ఉత్తర కోస్తాలో పొగమంచు హెచ్చరిక
ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోవచ్చని అంచనా. దీని వల్ల చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అల్లూరి జిల్లా పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది ఈ సీజన్‌లో నమోదైన తక్కువ ఉష్ణోగ్రతల్లో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు.
55
ఎల్‌నినో ప్రభావంపై స్కైమెట్ అంచనా
ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది వర్షాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీన లానినా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవి క్రమంగా తగ్గుతూ వచ్చే నెలలో తటస్థ స్థితికి చేరనున్నట్లు అంచనా. ఏప్రిల్ నుంచి ఎల్‌నినో వైపు పరిస్థితులు మారే అవకాశం ఉండగా, జూలై నెలాఖరుకు ఎల్‌నినో ఏర్పడుతుందని స్కైమెట్ తెలిపింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాల కాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై మార్చి నెలలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.