తెలంగాణలో వానలు.. అంతలోనే వడగాల్పులు
తెలంగాణలో వాతావరణం కాస్త మిక్స్డ్ గా ఉండబోతోంది. మే 14న రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. అయితే, మరో నాలుగు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ కూడా ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయి. మే 15-16 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగులో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మే 15 నుంచి ఇక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మే 17 నాటికి కరీంనగర్, పెద్దపల్లికి కూడా ఇవి విస్తరిస్తాయని ఐఎండీ అంచనా వేసింది.