Weather Update: ఏపీ వైపు టర్న్ తీసుకున్న అల్పపీడనం.. ఆ జిల్లాల్లో వానలు.. ఈ జిల్లాల్లో వడగాల్పులు !

Published : May 13, 2026, 07:19 AM IST

Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం దిశ మార్చుకుని ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రాలోని మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి.

PREV
15
ఐఎండీ వార్నింగ్.. మళ్ళీ వెనక్కి వచ్చిన అల్పపీడనం.. ఏపీలో వానలే వానలు

బంగాళాఖాతంలో వాతావరణం అస్సలు ఊహించని విధంగా మారుతోంది. అల్పపీడనం ఇప్పుడు సడన్ గా యూ టర్న్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అలాగే, రుతుపవనాల రాకపై ఐఎండీ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఆ వివరాలు గమనిస్తే..

25
అల్పపీడనం రివర్స్ గేర్.. ఉత్తరాంధ్రకు ముప్పు?

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మొదట శ్రీలంక వైపు వెళ్లి, ఆ తర్వాత ఈశాన్యం వైపు పయనించింది. ఇప్పుడు అది లెఫ్ట్ టర్న్ తీసుకుని వాయవ్య దిశగా అంటే సరిగ్గా ఉత్తరాంధ్ర వైపునకు వస్తోంది. ప్రస్తుతం ఇది గంటకు 36 నుంచి 52 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ వాయుగుండంగా మారేందుకు రెడీ అవుతోంది. సముద్ర మట్టానికి సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు కమ్మి ఉండటంతో, రానున్న 24 గంటల్లో ఇది మరింత స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి.

35
ఈ 11 జిల్లాలకు అలర్ట్

అల్పపీడన ప్రభావంతో మే 13 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

మే 14, 15 తేదీల్లో రాయలసీమలో కూడా ఉరుములు మెరుపులు కనిపిస్తాయి. అయితే వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి కాబట్టి, చెట్ల కింద గానీ, కరెంట్ స్తంభాల దగ్గర గానీ ఉండటం సేఫ్ కాదని అధికారులు తెలిపారు.

45
ఒకవైపు వాన.. మరోవైపు భానుడి భగభగలు

రాష్ట్రంలో వింత వాతావరణం నెలకొంది. ఓ పక్క వర్ష సూచన ఉన్నా, మరోపక్క ఎండలు మండిపోతున్నాయి. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. 

అల్లూరి జిల్లాలోని మన్యం ప్రాంతాలైన జికే వీధి, ముంచింగిపుట్టు వంటి మండలాల్లో వర్షాలకు బదులు వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. తెలంగాణలో కూడా మధ్యాహ్నం తర్వాత మేఘాలు కమ్మే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, షాద్ నగర్ వంటి ఏరియాల్లో అక్కడక్కడా జల్లులు పడొచ్చు.

55
రుతుపవనాల ఎంట్రీ ఫిక్స్

ఎండలతో అల్లాడుతున్న జనాలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ వారాంతానికే (మే 17 నాటికి) అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నాయి. అంటార్కిటికా దగ్గర వీస్తున్న భీకర గాలులు ఈ రుతుపవనాలను ఇండియా వైపు వేగంగా నెడుతున్నాయి. దీనివల్ల మే చివరి వారం నుంచి జూన్ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories