IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో ఆగమాగం... ఇక్కడ ఏకంగా 46 మి.మీ వర్షమే..! ఇక అతలాకుతలమే

Published : May 07, 2026, 07:47 AM ISTUpdated : May 07, 2026, 07:56 AM IST

IMD Rain Alert : మండువేసవి సమయంలోనూ తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే చెదురుమదురు జల్లులు కురుస్తుండగా ఈ రెండుమూడు రోజులు మరింత జోరందుకుని ఆగమాగం చేసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

PREV
16
తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు..

Today Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండావాన వాతావరణమే మరికొద్దిరోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఎండల తీవ్రత కాస్త తగ్గి వర్షాలు పెరుగుతాయంటూ చల్లని కబురు చెప్పింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి... ఈ రెండుమూడు రోజులు ఇవి మరింత జోరందుకుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

26
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..

ఆంధ ప్రదేశ్ పై అల్పపీడనం ప్రభావం గట్టిగానే ఉంటుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరిస్తోంది. ఇవాళ (మే 7, గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది. 

36
ఈ ప్రాంతాలకు పిడుగుల ప్రమాదం...

అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా కె.వీర్హి, గుర్తేడు, ముంచింగుపుట్టు మండలాలు... పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు... ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. కాబట్టి పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద నిలబడకూడదని సూచిస్తోంది.

46
తెలంగాణలో వర్షాలు...

తెలంగాణలో కూడా రెండుమూడు రోజులు ఎండల తీవ్రత తక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది... ఇదే సమయంలో వర్షాలు కూడా జోరందుకుంటాయని వెల్లడించింది.

ఇవాళ (మే 7, గురువారం) నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వారమంతా వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

56
నేడు హైదరాబాద్ వాతావరణం....

తెలంగాణ రాజధాని హైదరాబాద్ వాతావరణం విషయానికి వస్తే ఎండత తీవ్రత తగ్గుతుందట. ఆకాశం పాక్షికంగా మేఘాలతో కమ్ముకుని ఉంటుందని... సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తోడై ప్రమాదకరంగా మారే అవకాశాలుంటాయి... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శివారు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

66
నేడు హైదరాబాద్ వాతావరణం....

తెలంగాణ రాజధాని హైదరాబాద్ వాతావరణం విషయానికి వస్తే ఎండత తీవ్రత తగ్గుతుందట. ఆకాశం పాక్షికంగా మేఘాలతో కమ్ముకుని ఉంటుందని... సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తోడై ప్రమాదకరంగా మారే అవకాశాలుంటాయి... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శివారు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories