TTD: తిరుమ‌ల రూ. 300 టికెట్ కోసం 3 నెల‌లు ఆగాల్సిన ప‌నిలేదు.. మ‌రో అవ‌కాశం ఉంద‌ని తెలుసా.?

Published : May 05, 2026, 10:40 AM IST

TTD: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు అందరికీ దొరకడం కష్టమే. ప్రతి నెల భారీ డిమాండ్ ఉండటంతో చాలామంది భక్తులు నిరాశ చెందుతున్నారు. అయితే అలాంటి వారికి టీటీడీ మరో మంచి అవకాశం అందిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు. 

PREV
15
హోమం టికెట్‌తో దర్శనం ఎలా సాధ్యం?

టీటీడీ నిర్వహించే “శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం”లో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ప్రయోజనం ఉంది. ఈ హోమం టికెట్ తీసుకుంటే, అదే రోజు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతి ఇస్తారు. అంటే సాధారణంగా దొరకని దర్శనం టికెట్‌ను ఈ మార్గంలో పొందవచ్చు.

25
హోమం టికెట్ ధర, సౌకర్యాలు

ఈ ప్రత్యేక హోమం టికెట్ ధర రూ.1600గా ఉంటుంది. ఒక టికెట్‌పై ఇద్దరు భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. హోమంలో పాల్గొన్న తరువాత భక్తులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం సదుపాయం కల్పించడం ప్రధాన ఆకర్షణ.

35
హోమం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది?

ఈ హోమం అలిపిరిలోని సప్తగోప్రదక్షిణశాలలో ప్రతి రోజు నిర్వహిస్తారు. ఉదయం హోమంలో పాల్గొన్న భక్తులకు అదే రోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తిరుమలలో శ్రీవారి దర్శనం కల్పిస్తారు.

45
టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవాలి?

త‌ర్వాత నెల‌కు సంబంధించిన హోమం టికెట్ల‌ను టీడీపీ ఈనెల 25వ తేదీన విడుద‌ల చేస్తారు. ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. టికెట్లు త్వరగా ఫుల్ అయ్యే అవకాశం ఉండటంతో భక్తులు ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది.

55
భక్తులకు సూచనలు

రూ.300 దర్శనం టికెట్లు దొరకకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. హోమం టికెట్ ద్వారా కూడా శ్రీవారి దర్శనం పొందవచ్చు. ముందుగా ప్లాన్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుంటే, సులభంగా దర్శనం చేసే అవకాశం ఉంటుంది.

మొత్తం మీద తిరుమల దర్శనం కోసం ప్రత్యామ్నాయ మార్గం కావాలనుకునే భక్తులకు ఇది మంచి అవకాశం. హోమంలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక అనుభవం పొందడమే కాకుండా, శ్రీవారి దర్శనం కూడా సులభంగా చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories