Today Weather Update : మొంథా తుపాను సృష్టించిన విధ్వంసం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ షాక్ ఇచ్చింది. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందట… ఈ జిల్లాలకు వర్షాలు తప్పవట.
Weather Alert : వర్షాకాలం ముగిసింది... నైరుతి రుతుపవనాలు దేశాన్నివీడి నెలరోజులు కావస్తోంది. అయినా తెలుగు రాష్ట్రాలను వర్షాల వీడటంలేదు. ఇటీవల మొంథా తుపాను అటు ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు ఇటు తెలంగాణలో ఏస్థాయిలో బీభత్సం సృష్టించిందో చూశాం. భారీ వర్షాలు, వరదలే కాదు ఈదురుగాలులతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఈ తుపాను తర్వత అయినా వర్షాలు ముగిసినట్లే అనుకుంటుండగా వాతావరణ శాఖ భారీ వర్ష సూచనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
27
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
బంగాళాఖాతంలో మరోసారి వర్షాలకు అనుకూలంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ (బుధవారం, నవంబర్ 05న) రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయిని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిస్తాయట.
37
వరుసగా రెండ్రోజులు వానలే
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వరుసగా రెండ్రోజులు వానలు కురుస్తాయని... బుధవారం మొదలే గురువారం మరింత జోరందుకుంటాయని హెచ్చరించారు. నవంబర్ 6న నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రఖర్ జైన్ తెలిపారు. అకస్మాత్తుగా ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలుంటాయి... కాబట్టి చెట్ల క్రింద ఉండరాదని సూచించారు.
నిన్న (నవంబర్ 4, మంగళవారం) ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం 5 గంటలకు బాపట్లలో 61.5మిమీ, నంద్యాల జిల్లా నందికొట్కూరులో 51.7మిమీ, బొల్లవరంలో 43.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ సంస్ధ తెలిపింది.
57
తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఇదిలావుంటే తెలంగాణలో కూడా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ (బుధవారం) కూడా ఈ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
67
ఈ తెలంగాణ జిల్లాలోనూ వర్షాలు
ఇక జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
77
తెలంగాణ ఉష్ణోగ్రతలు
ఉష్ణోగ్రతల విషయానికి వస్తే... అత్యల్పంగా నల్గొండలొ 21.4, మెదక్ లో 21.8 డిగ్రీ సెల్సియస్... మిగతా జిల్లాల్లో 21 నుండి 25 డిగ్రీ సెల్సియస్ మధ్య నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధికంగా భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో 34 డిగ్రీ సెల్సియస్... మిగతా అన్ని జిల్లాల్లో 31 నుండి 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట. హైదరాబాద్ లో అత్యల్పంగా పటాన్ చెరు ఈక్రిశాట్ లో 21.4, అత్యధికంగా హకీంపేటలో 32.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.