Government Jobs : భారతదేశంలోని ప్రముఖ క్యాన్సర్ చికిత్స, పరిశోధన కేంద్రం టాటా మొమోరియల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ముంబై ప్రధానకేంద్రం దేశంలోని వివిధ నగరాల్లో ఈ TMC కార్యకలాపాలు సాగిస్తుంది... విశాఖపట్నంలోని హోమి బాబా క్యాన్సర్ సెంటర్ కూడా దీని పరిధిలోనిదే. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో మెడికల్ సిబ్బందితో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మంచి సాలరీతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కాబట్టి యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి... ఉద్యోగం వస్తేచాలు లైఫ్ సెట్ అయినట్లే.
ఈ నోటిఫికేషన్‌లో ఫిమేల్ నర్స్ ‘A’, నర్స్ ‘A’, స్టెనోగ్రాఫర్, ఫిమేల్ వార్డెన్, కిచెన్ సూపర్‌వైజర్, కుక్ – ‘A’, అటెండెంట్, ట్రేడ్ హెల్పర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్ లాంటి వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలాంటి మొత్తం 330 ఖాళీల భర్తీ నోటిఫికేషన్స్ ప్రకటించారు. విశాఖపట్నంతో పాటు దేశంలోకి వివిధ నగరాల్లో పోస్టింగ్ ఉంటుంది… ఎంపికైన వారికి అర్హతను బట్టి జీతం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరిలాగే ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.