IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల ఏకంగా సింగిల్ డిజిట్ (5 నుండి 10) డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కంగారుపెడుతోంది. దీని ప్రభావం ముఖ్యంగా తమిళనాడుపై ఎక్కువగా ఉంటుంది... కొన్నిజిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయట. అయితే ఈ ప్రభావం బార్డర్ లోని ఏపీ ప్రాంతాలపై ఏమైనా ఉంటుందా..? అనే అనుమానాలున్నాయి. ఒకవేళ ఉంటే కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలుంటాయి... మరి వాతావరణ శాఖ ఏం చెబుతుందో చూడాలి.
25
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
ఇదిలా ఉంటే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులో రాబోయే కొద్దిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందట. ముఖ్యంగా రామనాథపురం, శివగంగై జిల్లాల్లో ఈరోజు (బుధవారం, డిసెంబర్ 31) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
35
రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు
ఇక రేపు (గురువారం, 1 జనవరి 2026) తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెల్లవారుజామున కొన్నిచోట్ల వర్షం స్థాయిలో దట్టమైన పొగమంచు ఉంటుందని తెలిపింది.
జనవరి 2న (శుక్రవారం) దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. చలిగాలులకు ఈ వర్షం తోడయి ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది.
55
జనవరి 3న వర్షాలు
జనవరి 3న (శనివారం) దక్షిణ తమిళనాడులో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయట. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లలో పొడి వాతావరణం ఉంటుంది. జనవరి 4న కూడా పొడి వాతావరణమే కొనసాగుతుందని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక తమిళనాడు రాజధాని చెన్నై, శివారు ప్రాంతాల్లో ఈరోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.