తెలుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్.. SBI లో అకౌంట్ ఉంటే చాలు కోటి రూపాయలు

Published : Dec 30, 2025, 03:09 PM IST

SBI Insurance : తెలుగు ఉద్యోగుల కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా ఏకంగా కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్దమయ్యింది. ఇప్పటికే ఓ ఫ్యామిలీ ఈ డబ్బులు పొందింది. ఇందుకు అర్హులు ఎవరో తెలుసా? 

PREV
15
ఎస్బిఐలో అకౌంట్ ఉంటే కోటి రూపాయలు...

SBI Health Insurance : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... భారత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఈ బ్యాంకులో వివిధ రకాల అకౌంట్స్ కలిగి ఉన్నారు. అయితే తమ ఖాతాధారులకు కేవలం ఆర్థిక లావాదేవీలే కాదు ఇతర బెనిఫిట్స్ కూడా అందిస్తోంది ఎస్బిఐ. ఇలా శాలరీ అకౌంట్ కలిగివున్న ఉద్యోగులకు ఏకంగా కోటి రూపాయల ప్రమాద భీమా అందిస్తోంది. ఇది ఎవరికి వర్తిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

25
ఎస్బిఐ ప్రమాద భీమాకు అర్హులెవరు..?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఎస్బిఐలో శాలరీ అకౌంట్ కలిగివుంటే చాలు.. ప్రమాద భీమా వర్తించేలా MoU చేసుకున్నారు... ఇందుకోసం ఉద్యోగులు అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ (SGSP) కింద SBI లో శాలరీ అకౌంట్ కలిగిన ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణిస్తే అతడి కుటుంబానికి కోటి రూపాయల వరకు డబ్బులు అందుతాయి.

35
కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయలు..

SBI బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. గత జూలైలో అతడు మరణించగా ఇటీవలే బాధిత కుటుంబానికి SBI భీమా పరిహారం అందింది. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోటి రూపాయల చెక్కును పిచ్చేశ్వరరావు కుటుంబానికి అందజేశారు.

ఎన్టీఆర్ జిల్లా నందివాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పిచ్చేశ్వరరావు పనిచేసేవారు. అతడు ప్రమాదవశాత్తు మరణించగా ఎస్బిఐ ప్రమాదభీమా వర్తించింది. ప్రాసెస్ పూర్తిచేసిన ఎస్బిఐ ఇటీవలే భీమా డబ్బులు కోటి రూపాయలు విడుదలచేసింది... ఈ చెక్కును అతడి భార్య వెంకటదుర్గకు అందజేశారు సీఎం చంద్రబాబు. ఇలా ఎస్బిఐతో ఒప్పందం తర్వాత మొదటిసారి కోటి రూపాయల భీమా డబ్బులు అందుకున్నది పిచ్చేశ్వరరావు కుటుంబమే.

45
ఎంప్లాయి హెల్త్ స్కీమ్ (EHS)

SBI ప్రమాద భీమాకు అర్హులైన ఏపీ ఉద్యోగులు ప్రభుత్వం అందించే EHS గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది యధావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది. అంటే ఎంపికచేసిన హాస్పిటల్స్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు ఈ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కింద కూడా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం పొందవచ్చు. కానీ ఈ ఎస్బిఐ స్కీమ్ మాత్రం నేరుగా ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.

55
ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్...

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మరో స్కీమ్ APSEGIS... ఇది ఉద్యోగులందరికి తప్పనిసరి. దీనికింద ఉద్యోగి శాలరీతో కొంత డబ్బును కట్ చేసుకుంటారు... ప్రమాదవశాత్తు సదరు ఉద్యోగి మరణిస్తే కుటుంబసభ్యులకు భీమా కవరేజి అందుతుంది. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఈ పథకం కింద కట్ చేసుకున్న డబ్బులను వడ్డీతో సహా చెల్లిస్తారు. ఇది డెత్ బెనిఫిట్స్ తో సేవింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories