Couple: నువ్వు లేని లోకంలో నేనెలా ఉంటా.? ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రు రైలు కింద ప‌డి.

Published : Sep 30, 2025, 10:20 AM IST

Couple: పెద్ద‌ల‌ను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. ఇక జీవిత‌మంతా సంతోషంగా క‌లిసి గ‌డుపుతామ‌ని అనుకున్నారు. కానీ ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు. రైలు కింద ప‌డి ఆత్మ‌హత్య చేసుకున్నారు. ఈ హృద‌య‌విదార‌క‌ర ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందంటే.? 

PREV
16
యువజంట జీవితం విషాదాంతం

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం జీవితం మొత్తాన్ని చీకటిలో ముంచుతుంది. ఒక క్షణం ఆగి ఆలోచించి ఉంటే తప్పించుకునే పరిస్థితి, ఓ యువజంట విషయంలో అకాల మరణంగా మారింది. తల్లిదండ్రుల ఒప్పుకోకపోవడం వల్ల తమ ప్రేమను నిలబెట్టుకోలేక చివరకు ప్రాణాలనే త్యాగం చేశారు. ఈ హృదయవిదారక ఘటన పల్నాడు జిల్లాలోని మేడికొండూరు మండలంలో చోటుచేసుకుంది.

26
అస‌లేం జ‌రిగిందంటే.?

ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన కోటె గోపికృష్ణ (20), తెనాలి మండలం అత్తోట గ్రామానికి చెందిన బొల్లిముంత లక్ష్మీ ప్రియాంక (20) ఇద్దరూ గుంటూరులోని ఎన్‌ఆర్‌ఐఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. వేర్వేరు హాస్టళ్లలో ఉంటూ కాలేజీకి వెళ్తున్నారు. ఇదే స‌మ‌యంలో వీరి మ‌ధ్య మొద‌లైన స్నేహం కాస్త ప్రేమ‌గా మారింది. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.

36
పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన ప్రేమ జంట‌

తమ ప్రేమను ఇంట్లో అంగీకరించడం కష్టమని అర్థం చేసుకున్న ఈ జంట, ఈ నెల 5న గుంటూరులోని పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించింది. “మేము ప్రేమించుకుంటున్నాం, ఇప్పటికే పెళ్లి కూడా చేసుకున్నాం, దయచేసి రక్షణ కల్పించండి” అని పోలీసులు కోరారు. పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడినా పెద్దలు ఈ సంబంధానికి ఒప్పుకోలేదు. దీంతో, “మాకు ఎవరి సహాయం అవసరం లేదు, మేమే మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాం” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

46
రైలు ముందు పడిన గోపికృష్ణ

అయితే ఆత్మవిశ్వాసం ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ నెల 27న సాయంత్రం, గుంటూరు–మార్కాపురం మధ్య ప్రయాణిస్తున్న రైలు ముందు గోపికృష్ణ నిలబడ్డాడు. లోకో పైలట్‌ పలుమార్లు హారన్‌ కొట్టినా వెనక్కి తగ్గలేదు. చివరకు రైలు ఢీకొని గోపికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వార్త వెంటనే ప్రియాంకకు చేరింది.

56
ప్రియాంక కూడా..

తన ప్రియుడు లేని లోటు తట్టుకోలేకపోయింది ప్రియాంక. ప్రేమికుడు లేని లోకంలో తాను ఉండ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంది. మరుసటి రోజు అదే ప్రదేశానికి వెళ్లి రైలు ముందు పడింది. ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఉంటే బతికే భవిష్యత్తు ఉండేది. కానీ ప్రేమలో విఫలమవుతున్న బాధ ఆమె ప్రాణాన్ని త్యాగం చేసే స్థితికి తీసుకొచ్చింది. ఇద్ద‌రి మృతదేహాలను రైల్వే పోలీసులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

66
కన్నీరు మిగిల్చిన ప్రేమకథ

తల్లిదండ్రుల అంగీకారం కోసం కొంత కాలం ఎదురు చూసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. విద్యార్థి ద‌శ‌లో మొద‌లైన ఈ ప్రేమకథ ఇరు కుటుంబాల్లోనూ విషాధాన్ని నింపింది.

Read more Photos on
click me!

Recommended Stories