Tirumala : మతమార్పిడులను నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల టిటిడి బిగ్ డెసిషన్ తీసుకుంది. అదేంటో తెలుసా?
Tirumala : ఆంధ్ర ప్రదేశ్ లో మతమార్పిడులను నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పూనుకుంది. ఇందులో భాగంగానే దళితులకు ఆ దేవుడిని దగ్గర చేసేందుకు భారీ ఆలయాల నిర్మాణాానికి సిద్దమయ్యింది. దళిత కాలనీల్లో దాదాపు 5 వేల దేవాలయాల నిర్మించాలని ఇటీవల టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా టిటిడి నిర్ణయానికి ఆమోదం తెలపడంతో ఆలయాల నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది.
25
గత ఐదేళ్లలో అత్యధిక మతమార్పిడులు
తాజాగా టిటిడి మతమార్పిడుల నియంత్రణకోసం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బిజెపి అధికార ప్రతినిధి సాధినేని యామిని స్వాగతించారు. గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా మతమార్పిడులు జరిగాయని… ఈ సమయంలో వెయ్యికి పైగా అక్రమ చర్చిలు నిర్మించారని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో హిందువులను క్రైస్తవంలోకి మార్చడమే దీని ఉద్దేశమని యామిని శర్మ అన్నారు.
35
దళిత వాడలకే దేవుడు
సుమారు 5 వేలకు పైగా వెంకటేశ్వర స్వామి ఆలయాలను ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ దళిత వాడల్లో నిర్మించాలన్న టిటిడి నిర్ణయం అద్భుతమన్నారు యామిని. ఇందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోనే మతమార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణంతో హిందువులను ఏకం చేసే పని జరుగుతుంది. అందరికీ ఆ స్వామిని ప్రార్థించే అవకాశం లభిస్తుందని అన్నారు.
దేవాలయాన్ని నిర్మాణాన్ని వ్యతిరేకించేవారిపై యామిని సీరియస్
హిందూ దేవాలయాల నిర్మాణానికి టిటిడి నిధులు కేటాయిస్తే ఈ డబ్బులతో స్కూళ్లు, లేదా హాస్పిటల్స్ కడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కొందరు సోకాల్డ్ సెక్యులరిస్టు లెక్చర్ ఇస్తున్నారని యామిని గుర్తుచేశారు. ఇలాంటివారు ప్రజాధనంతో ఇమామ్ లకు జీతాలు, హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వడాన్ని కూడా ఇలాగే ప్రశ్నిస్తారా? అని నిలదీశారు. టిటిడి ఓ హిందూ ధార్మిక సంస్థ... ఇది తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని సాధినేని యామిని అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం హిందూ భక్తుల విరాళాలనే ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తుందని యామిని అన్నారు. అందులో భాగంగానే ఎస్సి, ఎస్టి కాలనీల్లో 5000 ఆలయాల నిర్మాణానికి పూనుకుంటోందని తెలిపారు. బయటివారు ఎవ్వరికీ దీనిని ప్రశ్నించే హక్కు లేదని అన్నారు. ఇప్పటికే టిటిడి సమాజంకోసం ఎంతో చేసిందని... దశాబ్దాలుగా రుయా, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ సైన్సెస్ ద్వారా వైద్యం అందించడమే కాదు పలు విద్యాసంస్థలకు ఆర్థికసాయం చేస్తుందని అన్నారు. కాబట్టి హిందుత్వ వ్యతిరేకులు టిటిడి గురించి అరవడం ఆపాలని సాధినేని యామిని ఘాటు కామెంట్స్ చేశారు.
55
టిటిడి కీలక నిర్ణయం
భారతీయ జనతా పార్టీ మతమార్పిడులను తీవ్రంతా వ్యతిరేకిస్తుంది.. కాబట్టి టిటిడి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో సమరసత సేవా ఫౌండేషన్ (ఎస్ఎస్ఎఫ్) దళిత వాడల్లో 800కు పైగా ఆలయాలను స్థాపించిందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మతమార్పిడుల నియంత్రణకు అన్ని విధాలా కఠిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తమకుందని బిజెపి నాయకురాలు యామిని శర్మ అన్నారు.