
APPSC Jobs : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా అసెంబ్లీ వేదికన ఆసక్తికర ప్రసంగం చేశారు. కూటమి (టిడిపి, జనసేన, బిజెపి) అధికారంలోకి వచ్చాక భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు... కేవలం 15 నెలల్లోనే అన్ని రంగాలు, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సీఎం వెల్లడించారు. ఇందులో ఇటీవల నియామక పత్రాలు అందించిన ప్రభుత్వ ఉపాద్యాయ ఉద్యోగాలతో పాటు భారీ పెట్టుబడుల ద్వారా ప్రైవేట్ రంగాల్లో జరిగిన ఉద్యోగ నియామకాలు ఉన్నాయి.
మెగా డీఎస్సీ ద్వారా 15941 ఉద్యోగాలను భర్తీ చేశాం... అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల్లో మరో 9093 ఉద్యోగాల భర్తీ పూర్తి చేశామని స్వయంగా సీఎం వెల్లడించారు. ఇక పోలీస్ శాఖలో 6100 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ - జాబ్ మేళాల ద్వారా 92,149, వర్క్ ఫ్రం హోం ద్వారా 5500... ఇలా ప్రైవేట్ రంగంలో మొత్తంగా 3,48,891 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఎవరు ఎక్కడ, ఎప్పుడు ఉద్యోగం పొందారు.. ఏ జాబ్ చేస్తున్నారు అనే సమస్త వివరాలను పోర్టల్ ద్వారా కూడా వెల్లడిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇలా లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే కాదు ఇకపై భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించడమే కాదు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC)తో పాటు ఇతర నియామక సంస్థల ద్వారా రెగ్యులర్ గా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపిపిఎస్సి కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది... నెలనెలా లక్షల సాలరీతో కూడిన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ నుండి ప్రారంభంకానుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే వెంటనే ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొండి. ఆసక్తి, అర్హత కలిగివుంటే దరఖాస్తు చేసుకోడానికి సిద్దంకండి.
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు -10
సాలరీ : రూ.25,220 నుండి రూ.80,910 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 09-10-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 29-10-2025
విద్యార్హతలు : ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన విద్యార్హతలు (ఎక్స్ సర్వీస్ మెన్స్ అంటే మాజీ సైనిక ఉద్యోగులు అర్హులు)
వయోపరిమితి : గరిష్టంగా 45 ఏళ్లలోపు వయసుండాలి.
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు : 07
సాలరీ : రూ.48,440 నుండి రూ.1,37,220 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 09-10-2025
దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ : 29-10-2025
అర్హతలు : ఇండియన్ ఆర్మీలో పనిచేసినవారు అర్హులు. ఆర్మీతో పాటు నేవి, ఎయిర్ పోర్స్ లో పనిచేసినవారు అర్హులు
వయోపరిమితి : గరిష్టంగా 52 ఏళ్లలోపువారు అర్హులు
జూనియర్ అకౌంటెంట్ (కేటగిరి 2 & 4), సీనియర్ అకౌంటెంట్ (కేటగిరి 3) - మొత్తం ఖాళీలు 11
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 09-10-2025
దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ : 29-09-2025
సాలరీ, వయో పరిమితి :
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (కేటగిరి 2) - రూ.44,570 నుండి రూ.1,27,480 వరకు సాలరీ ఉంటుంది - 18 నుండి 42 ఏళ్లలోపు వయసువారు అర్హులు
సినీయర్ అకౌంటెంట్ - రూ.34,580 నుండి రూ.1,07,210 వరకు సాలరీ ఉంటుంది - 18 నుండి 42 ఏళ్లలోపు వయసువారు అర్హులు
జూనియర్ అకౌంటెంట్ (కేటగిరి 4) - రూ.25,220 నుండి రూ.80,910 వరకు సాలరీ ఉంటుంది - 18 నుండి 42 ఏళ్లలోపు వయసువారు అర్హులు
విద్యార్హతలు ; అన్ని ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు : 01
సాలరీ : రూ.65,360 నుండి రూ.1,54,980 వరకు ఉంటుంది.
వయో పరిమితి : 18 నుండి 42 ఏళ్లలోపు వారు అర్హులు
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08-10-2025
దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ : 28-10-2025
విద్యార్హతలు : మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తిచేసి వుండాలి. 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు : 01
సాలరీ : రూ.45,830 నుండి రూ.1,30,580 వరకు ఉంటుంది.
వయోపరిమితి : 18 నుండి 42 ఏళ్లలోను వయసుండాలి
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08-10-2025
దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ : 28-10-2025
విద్యార్హతలు : జియాలజీ లో బిఎస్సి డిగ్రీ పూర్తిచేసి వుండాలి రెండేళ్ల పని అనుభవం ఉండాలి.