మొంథా తుపాను తీరం దాటుతున్న ప్రభావం కొనసాగుతుండటంతో బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగనున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ తాజా అప్‌డేట్ ప్రకారం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశముంది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా అనేక చోట్ల భారీవర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీవర్షాలు పడే అవకాశముందని తెలిపింది.