బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Published : Nov 16, 2025, 11:13 PM IST

Heavy Rains Cold Wave Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు చోట్ల  మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. బలమైన ఈదురుగాలులు ఉంటాయని పలు జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది.

PREV
15
మళ్లీ తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం

బంగాళాఖాతం మీద వరుసగా ఏర్పడుతున్న అల్పపీడన వ్యవస్థలు తెలుగు రాష్ట్రాలను మరోసారి ప్రభావితం చేస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాన్ని వాతావరణ శాఖ తెలిపింది. ఎక్కువగా ఏపీ పై ప్రభావం ఉండనుంది.

అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించిందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతుండటంతో వర్షాలు మరింత విస్తరించనున్నాయని అంచనా వేశారు.

25
ఏపీలో భారీ వర్షాలు: ఏ జిల్లాలు ప్రభావితం కానున్నాయి?

ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం నుండి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కడప, సత్యసాయి జిల్లా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలొచ్చాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

35
వచ్చే వారం మరో అల్పపీడనం

ఇప్పటి వ్యవస్థతోపాటు నవంబర్ 21నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

ఈ కొత్త అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

45
తెలంగాణ పై చలి పంజా

ఏపీలో వర్షాల ప్రభావం ఉండగా,  తెలంగాణలో మాత్రం చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 8–9 డిగ్రీలకు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 7 డిగ్రీల వరకు నమోదయ్యాయి.

పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ తగ్గిపోవడంతో ఉదయం ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఉదయం పూట బయటకు రావడం తగ్గించాలని సూచించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది.

55
రైతులు, మత్స్యకారులకు కీలక సూచనలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలు ఇచ్చింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలపై బలమైన గాలుల ప్రభావం ఉండవచ్చు. దీనికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులు సముద్ర వేటను తాత్కాలికంగా ఆపాలి. రైతులు పంటలు, ధాన్యాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు వర్షాలు ప్రభావం.. మరోవైపు చలి వణికిస్తోంది. రాబోయే వారం వరుస అల్పపీడనాలతో వాతావరణం మరింత ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read more Photos on
click me!

Recommended Stories