Jonnagiri gold mine: బంగారం బాబోయ్ బంగారం.. ఏపీలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్‌. ఎక్క‌డో తెలుసా?

Published : Jun 05, 2025, 02:30 PM ISTUpdated : Jun 05, 2025, 02:39 PM IST

సాధార‌ణంగా గోల్డ్ మైనింగ్ అంటే ఎక్క‌డో విదేశాల్లో జ‌రుగుతుంద‌ని అనుకుంటాం. అయితే భార‌త్‌లో అదికూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బంగారు గ‌నులు ఉన్నాయంటే న‌మ్ముతారా.? దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన తొలి గోల్డ్ మైనింగ్‌కు సంబంధించిన క‌థ‌నం ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
17
ఎక్క‌డుందంటే.?

జొన్నగిరి బంగారు ప్రాజెక్ట్ భారతదేశంలో ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గనుల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ను జియోమైసోర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. జొన్నగిరి గ్రామం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఈ గోల్డ్ మైన్ ఉంది.

27
ప్రాజెక్ట్ వివరాలు

గనుల లీజు విస్తీర్ణం: 597.82 హెక్టార్లు (సుమారు 1,477 ఎకరాలు).

గనుల బ్లాకులు: ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్.

మొత్తం బంగారు నిల్వలు: 361,000 ఔన్సులు (సుమారు 11.2 టన్నులు).

ప్రాజెక్ట్ కాలం: 8-15 సంవత్సరాలు.

ప్రముఖ భాగస్వాములు: డెక్కన్ గోల్డ్ మైన్స్ (40% వాటా), త్రివేణి ఎర్త్‌మూవర్స్.

37
గనుల అన్వేషణ, అభివృద్ధి

జియోమైసోర్ సంస్థ 2006లో గనుల లీజు కోసం దరఖాస్తు చేసింది. 2008లో మైనింగ్ ప్లాన్‌ను ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఆమోదించింది. 2010లో పర్యావరణ అనుమతులు లభించాయి. ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం సంస్థ 33,000 మీటర్ల డ్రిల్లింగ్, IP సర్వేలు, మాగ్నెటిక్ సర్వేలు వంటి అనేక అన్వేషణలు నిర్వహించింది.

47
గనుల నిర్వహణ, ప్రాసెసింగ్:

గనుల విధానం: ఓపెన్-పిట్ మైనింగ్.

ప్రాసెసింగ్ ప్లాంట్ సామర్థ్యం: ప్రారంభంగా 1,000 టన్నులు/రోజు, భవిష్యత్తులో 2,000 టన్నులు/రోజు వరకు విస్తరణ.

ఉప‌యోగిస్తున్న టెక్నాల‌జీ: గ్రావిటీ రికవరీ, సియానైడ్ లీచ్, కార్బన్-ఇన్-లీచ్ (CIL), ఎలక్ట్రో-విన్నింగ్, డోరే స్మెల్టింగ్.

పైలట్ ప్లాంట్: 3 టన్నులు/గంట సామర్థ్యంతో పనిచేస్తోంది, నెలకు సుమారు 60 కిలోల‌ బంగారం ఉత్పత్తి జ‌రుగుతుంది.

57
అనుమతులు, క్లియరెన్సులు:

పర్యావరణ అనుమతి: మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ & ఫారెస్ట్ నుండి 2043 వరకు చెల్లుబాటు.

కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ (CFE): ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నియంత్రణ మండలి నుండి పొందింది.

కన్సెంట్ టు ఆపరేట్ (CTO): 2025 జూన్ 4న పొందింది.

నీటి వినియోగ అనుమతి: HNSS కాలువ నుంచి 0.021 TMC నీటి వినియోగానికి అనుమతి ల‌భించింది.

67
ప్రాజెక్ట్ పురోగతి:

ప్రాజెక్ట్ పూర్తి స్థాయి వాణిజ్య ఉత్పత్తి 2025 చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పైలట్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రారంభ సంవత్సరంలో 400 కిలోలు, పూర్తి స్థాయిలో 750 కిలోలు బంగారం వార్షిక ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.

77
ఒక్క‌సారిగా పెరిగిన షేర్ విలువ‌

ప్రాజెక్ట్ ప్రారంభంతో డెక్కన్ గోల్డ్ మైన్స్ షేర్లు 14% పెరిగాయి, ఇది 10 నెలల గరిష్ట స్థాయి కావ‌డం విశేషం. ప్రాజెక్ట్ ప్రారంభ సంవత్సరంలో రూ.300-350 కోట్ల ఆదాయం, 60% EBITDA మార్జిన్ ఆశిస్తున్నారు. ఈ గనుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories