Tirumala: తిరుప‌తికి నాలుగున్నర గంటల్లోనే వెళ్లొచ్చు.. కొత్త వందే భార‌త్ రైలు వ‌చ్చేస్తోంది?

Published : Jun 01, 2025, 07:51 AM IST

వందే భార‌త్ రైళ్లు భార‌త రైల్వే ముఖ‌చిత్రాన్ని మార్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌యాణికులు సౌక‌ర్యాల‌తో పాటు ప్ర‌యాణ స‌మ‌యాన్ని సైతం త‌గ్గించాయి.ఈ క్ర‌మంలోనే మ‌రో కొత్త వందే భార‌త్ రైలు అందుబాటులోకి రానుంద‌ని తెలుస్తోంది.

PREV
16
విజయవాడ – బెంగళూరు వందే భారత్ రైలు

విజయవాడ నుంచి బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడిపేందుకు రైల్వే శాఖ ముందడుగు వేసింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ అమరావతి పరిధిలోని విజయవాడ నుంచి బెంగళూరు దాకా ఈ సూపర్‌ఫాస్ట్ రైలు ప్రయాణం సాగించాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది.

26
త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం

ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లడానికి కనీసం 12–16 గంటల సమయం పడుతోంది. అయితే కొత్త‌గా ప్రతిపాదించిన ఈ వందే భార‌త్ రైలుతో ఈ సమయం 9 గంటలకు త‌గ్గ‌నుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 3 గంటల సమయం ఆదా కానుంది. అంతే కాదు, ఈ రైలు వల్ల తిరుపతి వెళ్లే భక్తులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.

36
నాలుగున్న‌ర గంటల్లోనే తిరుప‌తికి

ఈ రైలు అందుబాటులోకి వ‌స్తే విజ‌య‌వాడ నుంచి తిరుప‌తికి వెళ్లే వారికి ఎంతో ప్ర‌యోజ‌నం జ‌ర‌గ‌నుంది. ముఖ్యంగా తిరుమ‌ల శ్రీవారికి భ‌క్తుల‌కు ఉప‌యోగ‌ప‌డ‌నుంది. గుంటూరు, అమ‌రావ‌తి, విజ‌య‌వడ ప్రాంతాల నుంచి తిరుప‌తికి వెళ్లే వారు ఇక‌పై కేవ‌లం నాలుగున్న‌ర గంట‌ల్లోనే తిరుప‌తికి చేరుకోవ‌చ్చు.

46
ప్ర‌తిపాద‌న‌లో ఉన్న రూట్లు

ఈ కొత్త వందేభారత్‌ కోసం రెండు రూట్లు ప్రతిపాదించారు. అనంతపురం మార్గం: విజయవాడ – గుంటూరు – నంద్యాల – గుంతకల్లు – అనంతపురం – హిందూపురం – బెంగళూరు. ఈ మార్గం ద్వారా అమరావతికి కూడా మంచి కనెక్టివిటీ కలుగుతుంది.

తిరుపతి మార్గం (ప్రధాన ప్రతిపాదన): స్టేషన్లు: విజయవాడ – తెనాలి – ఒంగోలు – నెల్లూరు – తిరుపతి – చిత్తూరు – కాట్పాడి – జోలార్‌పేట – కృష్ణరాజపురం – బెంగళూరు. 

ఈ మార్గాన్ని వందేభారత్‌ నడిపేందుకు ప్రయాణికులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తిరుపతి, చిత్తూరు వంటి పుణ్యక్షేత్రాలు కూడా ఈ రూట్లో ఉండటంతో భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాదాపు తిరుప‌తి మార్గ‌మే ఫైన‌ల్ కానుంద‌ని స‌మాచారం.

56
టైమింగ్స్ ఇలా ఉంటాయి.

ఈ రైలు (20711) విజయవాడ నుంచి ఉదయం 5:15 గంటలకు బయలుదేరుతుంది. తెనాలి – 5:39, ఒంగోలు – 6:28

నెల్లూరు – 7:43, తిరుపతి – 9:45, చిత్తూరు – 10:27, కాట్పాడి – 11:13, కృష్ణరాజపురం – 13:38, బెంగళూరు (SMVT) – 14:15కి చేరుకుంటుంది.

ఇక తిరుగు ప్రయాణం (20712) అదే రోజు: బెంగళూరు – 14:45లో బ‌య‌లు దేరుతుంది కృష్ణరాజపురం – 14:58,

కాట్పాడి – 17:23, చిత్తూరు – 17:49, తిరుపతి – 18:55, నెల్లూరు – 20:18, ఒంగోలు – 21:29, తెనాలి – 22:42, విజయవాడ – 23:45కి చేరుకుంటుంది.

66
రైల్వే శాఖ స్పందనపై ఆసక్తి

ఈ ప్రతిపాదనపై గతంలో ఎంపీలు పార్లమెంట్‌లో విషయాన్ని ప్రస్తావించారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు. మ‌రి రైల్వే శాఖ ఈ నిర్ణ‌యాన్ని ఎప్పుడు కార్య‌రూపం దాల్చుతుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories