తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 10 వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ, గురువారాల్లో అనేక ప్రాంతాల్లో వాన జల్లులు పడతాయి. పగటిపూటంతా దట్టమైన మేఘాలు కమ్మేసి, మధ్యాహ్నం నుంచి వర్ష తీవ్రత పెరిగే ఛాన్స్ ఉంది. సాయంత్రం వేళల్లో ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీ ప్లాన్స్ ముందే వేసుకోవడం బెటర్.
రాత్రి 11 గంటల వరకు అక్కడక్కడా వర్షాలు పడొచ్చు. నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, గద్వాల, సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కావచ్చు.