Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్

Published : Aug 03, 2026, 10:18 AM IST

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రాగల 72 గంటల్లో ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

PREV
15
72 గంటల పాటు ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వానలు!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాల విస్తరణతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాబోయే 72 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విస్తారంగా వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఈ మేరకు వివరాలు వెల్లడించాయి. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

25
తెలంగాణ వెదర్ అప్‌డేట్: ఏయే జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటే?

తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' ప్రకటించింది. సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండి, మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో విడతల వారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

35
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి: పిడుగులతో భారీ వర్షాలు

దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీడీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు పరిధిలోని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విజయనగరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలుతో పాటు ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడవచ్చు.

45
విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు: ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

గోదావరి వరద ఉధృతి తగ్గడంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుని, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఉరుములు, పిడుగులతో కూడిన ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

55
కేరళలో దంచికొడుతున్న వర్షాలు.. 12 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

కేరళలో వర్షాల ఉధృతి కొనసాగుతోంది. కేరళలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

• 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు: తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుళ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

• మత్స్యకారులకు వేటపై నిషేధం: సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని నిషేధం అమలులో ఉంది.

విద్యాసంస్థలకు సెలవు:

భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 03) 12 జిల్లాల్లోని ప్రొఫెషనల్ కాలేజీలతో సహా అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

సెలవు ప్రకటించిన 12 జిల్లాలు: కాసర్‌గోడ్, కణ్ణూర్, వయనాడ్, కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, పతనంతిట్ట, అలప్పుళ.

Read more Photos on
click me!

Recommended Stories