ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?

First Published | Jan 15, 2024, 3:22 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం  కాంగ్రెస్ పార్టీ  వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. 

ఏపీపై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అసెంబ్లీలను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది.  కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి  ఎన్నికైన ఎంపీలు కీలక పాత్ర పోషించిన  సందర్భాలు కూడ లేకపోలేదు. 

also read:నామినేటేడ్ పదవుల భర్తీకి రేవంత్ కసరత్తు:కోదండరామ్‌కు ఎమ్మెల్సీ?

ఏపీపై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజననతో  కాంగ్రెస్ పార్టీ  ఉనికిని కోల్పోయింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఎన్నికలకు  కొన్ని రోజుల ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 

also read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి: బీఆర్ఎస్ చెబుతున్న కారణాలివీ..

Latest Videos


ఏపీపై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?

దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై  కూడ  కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ లో  ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో  ఈ ఎన్నికల్లో   కనీసం  15 శాతం  ఓట్లను సాధించాలని  కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకుంది.  ఈ దిశగా  ఆ పార్టీ  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 

also read:టీడీపీలోకి పార్థసారథి?: తెర వెనుక కారణలివీ.....

ఏపీపై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?


ఈ నెల  4వ తేదీన  వైఎస్ఆర్‌టీపీ అధినేత వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీ వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వై.ఎస్. షర్మిల కీలక పాత్రో పోషించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా  ఉన్న  గిడుగు రుద్రరాజు  ఇవాళ  తన పదవికి రాజీనామా చేశారు.  దీంతో  వై.ఎస్. షర్మిలకు  కాంగ్రెస్ పార్టీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది. 
 

also read:సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

ఏపీపై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?

కాంగ్రెస్ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లేదా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్ష బాధ్యతలను  షర్మిలకు ఇస్తారనే ప్రచారంలో ఉంది.  అయితే గిడుగు రుద్రరాజు  పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో  వై.ఎస్. షర్మిలకే పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే  చర్చకు ఊతమిచ్చినట్టైంది. 

also read:ఎస్‌బీఐ బ్యాంకులోకి ఎద్దు: ఏం చేసిందంటే...వీడియో వైరల్

ఏపీపై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తన బలాన్ని పెంచుకోవడానికి  వై.ఎస్. షర్మిల దోహదపడుతుందని  కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.  వైఎస్ఆర్‌సీపీ పార్టీలోని అసంతృప్తులకు  కాంగ్రెస్ పార్టీ  గాలం వేస్తుందనే  ప్రచారం సాగుతుంది.  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు.  

also read:జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

ఏపీపై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?

మరో వైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి  వైఎస్ఆర్‌సీపీ రాజీనామా చేశారు.  కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డితో  ఇటీవల సమావేశమయ్యారు.  కాపు రామచంద్రారెడ్డి  కాంగ్రెస్ లో చేరుతారనే  ప్రచారం కూడ సాగుతుంది. కళ్యాణదుర్గం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు.  రాయదుర్గం నుండి తన ఆప్తులు పోటీ చేస్తారని  ఆయన  ప్రకటించారు. 

also read:కళ్యాణదుర్గం నుండి పోటీ:కాంగ్రెస్‌లోకి కాపు రామచంద్రారెడ్డి?

ఏపీపై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?

గెలుపు గుర్రాలకే  టిక్కెట్లు కేటాయించాలనే ఉద్దేశ్యంతో  సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను వైఎస్ఆర్‌సీపీ మారుస్తుంది.  అయితే టిక్కెట్టు దక్కని నేతలు  ప్రత్యామ్నాయమార్గాలను వెతుక్కుంటున్నారు.  ఈ క్రమంలోనే  వైఎస్ఆర్‌సీపీ అసంతృప్తులపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. 

also read:ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

ఏపీపై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ ఓటు బ్యాంకును వైఎస్ఆర్‌సీపీ తన వైపునకు తిప్పుకుంది.  అయితే  వై.ఎస్. షర్మిలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా  కాంగ్రెస్ ఓటు బ్యాంకు ను తిరిగి తమ వైపునకు తిప్పుకునేందుకు  ఆ పార్టీ ప్రయత్నాలను  ప్రారంభించింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు  తమ పార్టీ కారణమని భావించి పదేళ్ల పాటు తమను ప్రజలు దూరం పెట్టారని  కాంగ్రెస్ నేతలు  గుర్తు చేస్తున్నారు.

also read:కేసీఆర్ సహా ఆ ముగ్గురు పార్లమెంట్‌కేనా: బీఆర్ఎస్ వ్యూహం ఏమిటీ?

click me!