ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

First Published Dec 26, 2023, 10:25 AM IST

పోగోట్టుకున్న చోటే  వెతుక్కోవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తును ప్రారంభించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పూర్వ వైభవం కోసం ఆ పార్టీ కార్యాచరణను సిద్దం చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

రాష్ట్ర విభజనతో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తిరిగి  బలోపేతమయ్యేందుకు  ఆ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జీ బాధ్యతలను  మాణిక్యం ఠాగూర్ కు  ఆ పార్టీ నాయకత్వం  అప్పగించింది

also read:తెలంగాణ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఎవరు?:రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డిలలో ఎవరికి దక్కునో

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలతో  రాహుల్ గాంధీ  ఈ నెల  27న న్యూఢిల్లీలో  సమావేశం కానున్నారు.  నిర్ణీత షెడ్యూల్ మేరకు 2024 ఏప్రిల్ లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే  నిర్ణీత షెడ్యూల్ కంటే  ముందే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.ఈ తరుణంలో  అన్ని రాజకీయ పార్టీలు  ఎన్నికలకు  సన్నద్దమౌతున్నాయి.   పోగోట్టుకున్న చోటే  వెతుక్కోవాలని కాంగ్రెస్ పార్టీ కూడ  సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ  జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తుంది. 

also read:పార్లమెంట్ ఎన్నికలు 2024: తెలంగాణకు అమిత్ షా, ఆ స్థానాలే టార్గెట్

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీకి  అసెంబ్లీలో  ప్రాతినిథ్యం లేకుండా పోయింది.  ఆ పార్టీ అభ్యర్థులకు  డిపాజిట్లు కూడ దక్కలేదు.  ఇక ఎంపీ స్థానాల్లో  పోటీ చేసేందుకు ఆసక్తి చూపేవారే లేరు. ఈ నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు తెచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తును ప్రారంభించింది. 

also read:ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ,జనసేన పొత్తు: బీజేపీ దారెటు?

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  సోదరి వై.ఎస్. షర్మిల ఏర్పాటు చేసిన యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ)  కాంగ్రెస్ లో విలీన ప్రక్రియ చివరి నిమిషంలో నిలిచిపోయింది.  అయితే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వై.ఎస్. షర్మిల  పోటీ చేయలేదు.  కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది.  తెలంగాణలో  వై.ఎస్. షర్మిల  సేవలను వినియోగించుకోవడంపై  కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 

also read:ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. షర్మిల సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ  భావిస్తుంది.  2024 జనవరిలో  షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.   కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని  షర్మిలకు ఇచ్చే అవకాశం ఉంది.  ఉత్తరాది రాష్ట్రాల ఇంచార్జీగా  షర్మిలను నియమించనున్నారని సమాచారం.  

also read:ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిల‌తో జగన్ కు చెక్ ?

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  అభ్యర్థులను మార్చుతున్నారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో  ఇప్పటికే  11 అసెంబ్లీ ఇంచార్జీలను మార్చారు.  మరికొందరి మార్పు జరగనుంది. వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు నిరాకరించిన  అభ్యర్థులకు కాంగ్రెస్ టిక్కెట్టు దక్కే అవకాశం లేకపోలేదు. 

also read:పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశిస్తే  రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి  తిరిగి కాంగ్రెస్ పార్టీలో  యాక్టివ్ అయ్యారు.  గతంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా  యాక్టివ్ గా పనిచేసిన వారితో ఆ పార్టీ నాయకత్వం టచ్ లోకి వెళ్లాలని భావిస్తుంది. 

also read:ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల  27న జరిగే సమావేశంలో రాహుల్ గాంధీ  దిశా నిర్ధేశం చేయనున్నారు. వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో  క్రియాశీలకంగా వ్యవహరిస్తే దాని ప్రభావం  పార్టీపై  ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.

also read:తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం,  విజయవాడల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్వహించనున్నారు.ఈ సభల్లో వై.ఎస్. షర్మిల కూడ పాల్గొనేలా  ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తుందనే  ప్రచారం కూడ లేకపోలేదు. కర్ణాటక రాష్ట్రం నుండి  షర్మిలను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుందనే చర్చ కూడ ఉంది.  

also read:తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

click me!