ఈ తీవ్ర వాయుగుండం తన దిశను మార్చుకుని ఉత్తరం వైపుగా వెళ్లడం వల్ల అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు పడటం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడవచ్చు.
అయితే, రాష్ట్రంలో ఇప్పటివరకు 54 శాతం వర్షపాతం లోటు నమోదవ్వడం, ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో వ్యవసాయానికి సరైన నీరు అందక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.