Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే వార్త. ఏపీ రాజకీయాల్లో మెగాస్టార్ కొత్త రోల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. చిరంజీవి చేతుల్లో ఏపీ కూటమి ప్రభుత్వం కీలక బాధ్యతలు పెట్టనుందనీ, సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారని టాక్ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ‘మెగా’ గాలి వీస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ కావడమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు చంద్రబాబు పట్ల ఉన్న వైఖరిని చిరంజీవి ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేసి, ఆయనతో చాలా సానుకూలంగా, ఆత్మీయంగా మెలుగుతున్నారు. వీరిద్దరి మధ్య నెలకొన్న ఈ సరికొత్త సత్సంబంధాలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే తెరలేపాయి.
ముఖ్యంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ముందస్తుగా చర్చించిన తర్వాతే చంద్రబాబు ఈ భేటీని ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకు మధ్య ఒక బలమైన వారధిగా నిలిచే పెద్ద బాధ్యతను చిరంజీవికి అప్పగించాలని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఆలోచిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒక పొలిటికల్ సెన్సేషన్‌గా మారింది.
24
ఎన్నికల సపోర్టు నుండి ప్రమాణ స్వీకారం వరకు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధినేత, తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు సపోర్టుగా చిరంజీవి బహిరంగంగానే వాయిస్ వినిపించారు. మెగా ఫ్యామిలీ అంతా ఏకమై కూటమి విజయానికి తమవంతు సపోర్ట్ ఇచ్చింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ చిరంజీవికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ తన అన్న పాదాలకు నమస్కరించడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మెగా సోదరులను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఆ క్షణం నుండి కూటమి ప్రభుత్వ విధానాలపై చిరు ఎంతో పాజిటివ్‌గా స్పందిస్తూ, వారు చేస్తున్న మంచి పనులను నిరంతరం అభినందిస్తున్నారు. అందుకే ఆయనకున్న అపారమైన క్రేజ్, ప్రజాదరణను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించుకోవాలని చంద్రబాబు, పవన్ ఆలోచిస్తున్నారు.
34
ప్రత్యక్ష రాజకీయాల నుండి సంక్షేమ బ్రాండ్ అంబాసిడర్ దాకా
గతంలో 'ప్రజారాజ్యం' పార్టీని స్థాపించి ఉమ్మడి ఏపీలో తనదైన ముద్ర వేసిన చిరంజీవి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్రమంత్రిగానూ పనిచేశారు. కానీ రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు పూర్తి స్వస్తి చెప్పి మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయారు. ఆ తర్వాత బీజేపీ నుంచి రాజ్యసభ ఆఫర్ వచ్చినా, జగన్ హయాంలో రకరకాల వార్తలు వచ్చినా ఆయన రాజకీయాల వైపు అడుగు వేయలేదు.
కానీ ఇప్పుడు ఏపీలో రూపుదిద్దుకున్న కొత్త సమీకరణాల నేపథ్యంలో, ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని చంద్రబాబు మెగాస్టార్ ను కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కింగ్ నాగార్జున ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తగా వ్యవహరించి మెప్పించినట్లే, ఇప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వ పథకాలను కూడా అట్టడుగు వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చిరంజీవే సరైన ఛాయిస్ అని బాబు ప్రతిపాదించారని సమాచారం.
సీఎం చంద్రబాబు నేరుగా తన ముందుంచిన ఈ బిగ్ ఆఫర్‌పై మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో పాజిటివ్‌గానే స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కీలక బాధ్యతను అధికారికంగా స్వీకరించే ముందు, తనకున్న సినిమా కమిట్‌మెంట్లు, ఇతర పర్సనల్ పనులను ఒకసారి బేరీజు వేసుకోవడానికి కొంత సమయం అడిగారని టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడితే గనుక, ఏపీ పొలిటికల్ సీన్‌లో ఇది అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కానుంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు కూటమి ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారితే, అది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.