జగన్ కు చిక్కులు ఇవే: అమరావతి రైతులతో ఒప్పందమే కీలకం

First Published Aug 4, 2020, 3:35 PM IST

3 రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.  పిటిషన్ ను విచారణకు ఏపీ హైకోర్టు కొద్దిసేపటికింద అంగీకరించింది కూడా.  మధ్యాహ్నం మూడు గంటలకు  రాజధానుల గెజిట్ నిలిపివేత, సీఆర్డీఏ రద్దు, సీఎం కార్యాలయం, రాజ్ భవన్ తరలింపు పై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. 

మూడు రాజధానుల అంశం ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మూడు రాజధానులు సాకారం కాకుండా ఉండే అనేక విషయాలపై ఆశలు పెట్టుకున్నారు అమరావతి రైతులు. కానీ ఒక్కొక్కటిగా వారి భ్రమలు తొలిగిపోతూ వచ్చాయి.తొలుత శాసన మండలిలో ఆ బిల్లును అడ్డుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు.
undefined
ఆ తరువాత గవర్నర్ దాన్ని ఆమోదించరు అని అనుకున్నారు. ఆ భ్రమ కూడా మొన్నటితో తేలిపోయింది.కేంద్రం సరైన సమయంలో మూడు రాజధానులపై జోక్యం చేసుకుంటుందని అనుకున్నారు. కానీ అది కూడా సాధ్యపడడంలేదు. కేంద్రం జోక్యం చేసుకోదు అని బీజేపీ పదే పదే చెప్పడం, సోము వీర్రాజు అధ్యక్షుడవడం... ఇక కేంద్రం మీద కూడా ఆశలు వదులుకున్న అమరావతి ప్రాంత ప్రజలు కోర్టులను ఆశ్రయించారు.
undefined
3 రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారణకు ఏపీ హైకోర్టు కొద్దిసేపటికింద అంగీకరించింది కూడా. మధ్యాహ్నం మూడుగంటలకురాజధానుల గెజిట్ నిలిపివేత, సీఆర్డీఏ రద్దు, సీఎం కార్యాలయం, రాజ్ భవన్ తరలింపు పై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు.
undefined
టీవీ డిబేట్లలో మాట్లాడుతున్నవారంతా పాలకుడు మారినప్పుడల్లా రాజధానులను మార్చుకుంటూ పోతే... ప్రతి నాయకుడి 5 సంవత్సరాలు కూడా రాజధాని మార్పుకు సరిపోతుంది తప్ప పాలన ఎలా సాగుతుందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు.
undefined
ఇలాంటి విషయాలు మనకు డిబేట్లలో చర్చించుకోవడానికి, సోషల్ మీడియాలో పంచులు వేయడానికి ఉపయోగపడవచ్చు కానీ.... వాస్తవిక దృక్పథంతో పరిశీలిస్తే.... రాజధాని ఎక్కడుండాలనేది ప్రభుత్వ నిర్ణయం. దానిపై కోర్టు జోక్యం చేసుకోబోదు. మన రాజ్యంగంలోని మూడు ప్రధాన అంగాలు కూడా వాటి పరిధికి లోబడే పనిచేస్తాయి కాబట్టి, కోర్టు ఆ వాదనను వినకపోవచ్చు. మంచి లాయర్ గనుక ఈ కేసును వాదిస్తే... ఆ వ్యాఖ్య ఏదో సపోర్టింగ్ స్టేట్మెంట్ గా వాడతాడే తప్పితే... అదే ప్రధాన అంశం మాత్రం కాదు.
undefined
తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత సందర్భంగా కోర్టులో దాఖలైన అనేక పిటిషన్లను పరిశీలించిన కోర్టు.... నూతన భవంతుల నిర్మాణం ఇత్యాదులన్నీ ప్రభుత్వ పరిపాలన కిందకు వస్తాయి. అందులో మేము జోక్యంచేసుకోలేము అని తేల్చి చెప్పింది కదా. ఇక్కడ అమరావతి విషయంలో కూడా అంతే!
undefined
ఇక మరో వాదన రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి తెరపైకి వస్తుంది. చట్టంలో ఒక్క రాజధాని అని మాత్రమే ఉంది అందులో, రాజధానులు అని ఎక్కడా అందులో పేర్కొనలేదు అని అంటున్నారు. టెక్నికల్ అంశాలపట్ల ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అంతే కాకుండా... ఇక్కడ రాజధాని మార్పు జరగడంలేదు అని ప్రభుత్వం వాదించవచ్చు. ఇక్కడ కేవలం పరిపాలన వికేంద్రీకరణ మాత్రమే జరుగుతుందని ప్రభుత్వం చెబుతుంది, బిల్లు పేరుకూడా అదే.
undefined
కాబట్టి ఇప్పుడు ఇక్కడ రైతులు తమ హక్కుల పరిరక్షణను తెర మీదకు తీసుకరానున్నట్టుగా తెలుస్తుంది. రైతులు రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చారు. అందులో సందేహం లేదు.వారు 33వేల ఎకరాలను ఇచ్చింది చంద్రబాబు నాయుడుకో, జగన్ మోహన్ రెడ్డికో కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. వారు ప్రభుత్వం తమ భూములను అభివృద్ధి చేసి ఇస్తారనేనమ్మకంపైన బంగారం లాంటి 33వేల ఎకరాలను స్వచ్చంధంగా ఇచ్చారు.
undefined
ఇప్పుడు ప్రభుత్వం అక్కడి నుంచి మార్చి విశాఖపట్నానికి తరలిస్తే తమ భూముల అభివృద్ధి ఆగిపోతుందని వారు నిరసనలు తెలుపుతున్నారు. కోర్టుకెక్కారు.ప్రభుత్వం స్పందించి వాటిని అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పారు. అదే విషయాన్నీ వారు కోర్టుకు సైతం చెప్పవచ్చు.ప్రభుత్వం దృష్టిలో ఇప్పుడు అభివృద్ధి అంటే ఏమిటి? రోడ్లు నిర్మించి,విద్యుత్ కనెక్షన్లిస్తే సరిపోతుందా? వారు తమ భూములను ఇచ్చింది అమరావతి వంటి మహానగరం వస్తుందనే ఒక ఆశతో, తమ భూములు అభివృద్ధి చెందితే వాటి ధరలు ఎక్కువవుతాయన్న ఉద్దేశంతో.
undefined
ఇప్పుడు కేవలం ఇక్కడ అసెంబ్లీ మాత్రమే నిర్మిస్తే అంతటి అభివృద్ధి జరుగుతుందా..?అక్కడ కేంద్రంగా పాలనా జరిగినప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది తప్ప కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటె కాదు. అసెంబ్లీ సమావేశాలున్నప్పుడు అక్కడకు ఎమ్మెల్యేలు వచ్చిపోతారుతప్పితే మిగిలిన రోజుల్లో అక్కడ ఎవరూ ఉండరు.ఇప్పుడు కొద్దిసేపు ప్రభుత్వం చెప్పినట్టే భూములను అభివృద్ధి చేసి ఇచ్చిందనుకుందాం. ఆ భూములను వారు చాలా తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుంది. దానితోపాటు ఇప్పుడు ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తానని చెబితే వారికి అప్పుడు కౌలు డబ్బులు కూడా చెల్లిస్తాం అన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాట కూడా తుంగలో తొక్కినట్టే కదా.
undefined
ఇప్పుడు భూములను తిరిగి ఇవ్వాలనుకుంటే... ఒక చిన్న సమస్య కూడా ఉంది. భూములన్నిటిని కలిపి నిర్మాణాలు చేపట్టడం వల్ల ఎవరి భూమి ఎక్కడో కరెక్టుగా గుర్తుపట్టలేని పరిస్థితి. ఒకవేళ గుర్తుపట్టినప్పటికీ, వారికి ఇలా అసంపూర్తిగా నిర్మానయినా భవనాలను ఎం చేసుకుంటారు. ఆ భూములను రైతులు తీసుకొని ఎం చేస్తారు. వాటి మీద వ్యవసాయం ఎలా చేస్తారు?
undefined
పోనీ ప్రభుత్వమే ఆ భవనాలన్నిటిని కూలగొట్టి మొత్తం నేలను చదును చేసి ఇచ్చిందనే అనుకుందాం. ఆ భూములు గతంలో ఉన్నట్టు సారవంతంగా ఉంటాయా? బలమైన పునాదులకోసం కాంక్రీట్, ఇనుము ఇతర నిర్మాణ సామగ్రితో నిండిపోయి ఉన్న భూమి వ్యవసాయానికి ఎలా పనికొస్తుంది? రైతులిప్పుడు అటు సంవత్సరానికి మూడుపంతాలను పండించే జరీ భూములను కోల్పోయి, వస్తుంది అనుకున్న అమరావతి మహానగరం రాక రెంటికి చెడ్డ రేవడిలా మారిందివారి బ్రతుకు.
undefined
కాబట్టి ఇది ముమ్మాటికీ ప్రజలకు జరుగుతున్న అన్యాయమే.ప్రభుత్వంతో రైతులు చేసుకున్న కాంట్రాక్టును అర్థాంతరంగా ప్రభుత్వం తప్పింది. కాంట్రాక్టుల పరిభాషలో చెప్పాలంటే... ప్రభుత్వం ప్రజలతో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించి వారికి అన్యాయం చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హక్కులకు భంగం కలిగినందున, వారికి మోసం జరిగిందని భావించి వారు కోర్టుకెక్కారు.
undefined
డెవలప్ చేసి ఇస్తాము(రాజధాని నిర్మాణం) అన్న డెవలపర్(ప్రభుత్వం) వారి కాంట్రాక్టు నిబంధనలకులోబడకుండా, ఆ నియమాలను తుంగలో తొక్కాడు(విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు). అందువల్ల తమ కాంట్రాక్టును గౌరవించేలా డెవలపర్ ని ఆదేశించామని భూములిచ్చిన వారు కోర్టుకెక్కుతున్నారు. ఈ వాదనని బహుశా వారు ముందుపెట్టొచ్చు.
undefined
click me!