
పిల్లలు తరచుగా జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ అడుగుతుంటారు. కానీ బయట డ్రింక్స్ రుచిని మాత్రమే ఇస్తాయి. ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకొనే 5 ఆరోగ్యకరమైన డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.
కట్ చేసిన తాజా పండ్లు స్ట్రాబెర్రీ, నారింజ, పైనాపిల్‌లో కొద్దిగా నిమ్మరసం, తేనె వేయండి. దానితో పాటు ఐస్ క్యూబ్స్ వేసి బాగా బ్లెండ్ చేయండి. అంతే సింపుల్ గా హెల్దీ డ్రింక్ రెడీ. దీన్ని వడకట్టి, పుదీనా ఆకులతో అలంకరించి తాగితే కడుపులో హాయిగా ఉంటుంది.
చాలా మంది పిల్లలు అరటిపండు అంటే ఇష్టపడతారు. మీరు కూడా గ్రైండర్ జార్‌లో పండిన అరటిపండ్లు, పాలు, తేనె వేసి గ్రైండ్ చేయండి. తర్వాత దాన్ని 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. చివరగా పిల్లలకు ఇస్తే హ్యాపీగా తాగేస్తారు. ఇది ఆరోగ్యంతో పాటు వెంటనే శక్తినిస్తుంది.
క్యారెట్, ఆపిల్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. స్మూతీ తయారు చేయడానికి సగం కప్పు క్యారెట్, ఆపిల్ జ్యూస్ తీసుకోండి. తర్వాత దానిలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలపండి. ఇప్పుడు దాన్ని బాగా బ్లెండ్ చేసి ఐస్ క్యూబ్స్ వేసి పిల్లలకు ఇస్తే కొంచెం కూడా వదలకుండా తింటారు.
మీ పిల్లలు పండ్లు డైరెక్ట్ తినకపోతే వారికి ఇలా మిక్స్‌డ్ ఫ్రూట్ స్మూతీ చేసి ఇవ్వండి. దీని కోసం ఆపిల్, అరటిపండు, కివీ, పీచు వంటి పండ్లను కలిపి తేనెతో బ్లెండ్ చేయండి. ఇది వెంటనే శక్తిని ఇవ్వడంతో పాటు పిల్లలను రోజంతా చురుగ్గా ఉంచుతుంది.
పిల్లలకు విటమిన్లు, ఖనిజాలు ఇవ్వడం చాలా ముఖ్యం. కానీ నేటి బిజీ జీవితంలో ఇది చాలా కష్టం. పిల్లలు కూడా కూరగాయలు, పండ్లు తినమంటే ముఖం చాటేస్తారు. అలాంటప్పుడు మీరు రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు టీస్పూన్ల తేనె, చల్లటి నీటిని కలిపి పిల్లలకు ఇవ్వండి. ఇది పిల్లల శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లను అందిస్తుంది.