Chicken: అమ్మ బాబోయ్ .. రోజూ చికెన్ తింటే ఇంత డేంజరా?

Published : May 05, 2025, 06:56 PM IST
Chicken: అమ్మ బాబోయ్ .. రోజూ చికెన్  తింటే ఇంత డేంజరా?

సారాంశం

Chicken in daily diet: కొత్త పరిశోధన ప్రకారం వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటే జీర్ణవ్యవస్థ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట. ముఖ్యంగా పురుషుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండట.  

ఆరోగ్య చిట్కాలు: తక్కువ ధరలో  ప్రోటీన్ దొరికే పుడ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేంది చికెన్. వ్యాయామం చేసేవాళ్ళు, బరువు పెరగాలనుకునేవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవారికి కూడా చికెన్ కు మొదటి ప్రాధ్యానత ఇస్తారు. కానీ వారానికి ఎక్కువ చికెన్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని మీకు తెలుసా?

'న్యూట్రియెంట్స్' జర్నల్‌లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం.. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటే జీర్ణశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరముంది, కానీ, ఈ విషయం మాత్రం చికెన్ ప్రియులకు ఆందోళన కలిగించేదే. 

పరిశోధన విశ్లేషణ

ఇటలీలోని సవేరియో-డి-బెల్లిస్ హాస్పిటల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో-ఎంటరాలజీ పరిశోధకులు దాదాపు 19 సంవత్సరాల పైబడ్డ నాలుగు వేల మందిపై పరిశోధన చేశారు. వారులో కొంతమంది వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారు,  మరికొందరూ 100 గ్రాముల కంటే తక్కువ తినేవారు. వీరిద్దరిలో ఎక్కువ చికెన్ తినే వారికి జీర్ణవ్యవస్థ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 27 శాతం ఎక్కువ అని పరిశోధనలో తేలింది. పురుషుల్లో ఈ ప్రమాదం రెట్టింపు.

నిపుణుల అభిప్రాయాలు

అయితే.. ఈ పరిశోధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్యాన్సర్ ఉన్నవారి చికెన్ తినే అలవాట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని, చికెన్ తినేవారందరినీ పరిశీలించలేదని కొందరు పరిశోధకులు అంటున్నారు. దీనివల్ల చికెన్ మాత్రమే కారణం అనే భావన కలుగుతుంది. ఇతర అనారోగ్య కారకాలను పరిగణనలోకి తీసుకోలేదు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chicken: చికెన్‌ని వండేముందు కడుగుతున్నారా? ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి
Honey Facts: 100 ఏళ్లయినా తేనె ఎందుకు పాడవ్వదు.? ఇందులో ఉన్న సైంటిఫిక్ కారణాలు ఏంటో తెలుసా.?