Food : హోటల్ ఫుడ్ లో ఎన్ని రసాయనాలుంటాయో తెలుసా..? తిన్నారో అంతే సంగతి

Published : Apr 20, 2026, 06:15 PM IST
Hotel Food

సారాంశం

హోటల్ ఫుడ్ ఎంత ప్రమాదకరమో తెలియజేసే ప్రయత్నమిది. ఫుడ్ కు మంచి లుక్, రుచి కోసం అనేక రసాయనాలను కలుపుతారు. వీటివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. 

హోటల్ భోజనంబు... రసాయన వంటకంబు..!

అప్పుడెప్పుడో సత్తె కాలంలో దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రమే పూట కూళ్ళమ్మి ఇంట్లో.. మిగతా రోజుల్లో ఇంట్లో భోజనం చేసే జనాలు.

అటుపై బ్రాహ్మణ భోజనశాలలు (అంటే శాఖాహార భోజనశాల), మిలిటరీ భోజనశాల (మాంసాహార భోజనశాల). బయట ప్రయాణాలు చేసేవారు... వీటిలో భోజనం చేసేవారు.

ఇప్పుడు కాలంమారింది.

అన్నం, పప్పుచారు, సాంబార్, ఇడ్లీ, దోస, రసం, గడ్డ పెరుగు, మజ్జిగ, పచ్చిపులుసు లాంటి ఫుడ్స్... చాదస్తం ఫుడ్స్ లిస్ట్ లోకి వచ్చేసాయి.

శాండ్విచ్, వ్రాప్, సూప్, పిజ్జా, పాస్తా, నూడుల్స్, చౌమేయిన్, ఫ్రైడ్ రైస్, చిల్లి పన్నీర్, చిల్లి చికెన్, గోబీ మంచురియా, చికెన్ మంచురియా. చేజవాన్ రైస్, చేజవాన్ నూడుల్స్, మోమోస్ (మామలు అనే తెలుగు పదానికి అనువాదం కాదని మనవి), స్ప్రింగ్ రోల్స్ , చిల్లి గార్లిక్ పొటాటోస్, హనీ చిల్లి పొటాటో, స్టిర్ ఫ్రైడ్ వెజిటల్స్, చికెన్ బిర్యాని, వెజిటల్ బిర్యాని...

"అసలు ఆ టేస్ట్ ఉంటుంది బ్రో .. సూపర్ అనుకో."

రెస్టారెంట్ కు పొతే ఈ ఫుడ్స్ కు ... కాంబోగా పెప్సీ, కోక్, స్ప్రైట్, థమ్ప్స్ అప్ లాంటివి ఇస్తారు.

"ఇంతకాలం జనాలు ఏమి తిన్నారో, ఎలా బతికారో అర్థం కాదు మామా..! టేస్ట్ అంటే ఇది కదా..? ఇది లేకుండా బతకడం ఎలా అనిపిస్తుంది."

పెద్ద కంపెనీ లలో రెస్టారెంట్ లు ఉంటాయి. రోజుకు అయిదు పూటలు (బ్రేక్ ఫాస్ట్, బృంచ్, లంచ్, ఈవెనింగ్ స్నాక్స్, డిన్నర్) .. ఇందులో ఫ్రీ.

ఇంట్లో ఫుడ్ బోర్ కొట్టి.. డబ్బు ఎక్కువై... స్విగ్గి, జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ తెప్పించుకోవడం పరిపాటిగా మారింది. బెంగళూరు లాంటి నగరాల్లో వారానికి 12-15 సార్లు (7 x 3 = 21 కి 12- 15 సార్లు) ఫుడ్ ఆర్డర్స్ తెప్పించుకొని మోడరన్ ఫామిలీస్.

ఇవి కాకుండా ఈట్ ఔట్స్.

యూట్యూబ్ చూసి ఆధునిక వంటకాలు నేర్చుకొనేవారు.

"ఎవరి టేస్ట్ వారిది. ఎవరి డబ్బు వారిది. మనం ఎవరు అడగడానికి చెప్పడానికి..." అని కొంతమంది.

నిజమే...

బయట ఫుడ్ కు ఇంత గొప్ప టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాము.

అలాగే పనిలోపనిగా సైన్స్ ఏమి చెబుతుందో కూడా ఒక లుక్ వేద్దాము.

పైన పేర్కొన్న ప్రతి మోడరన్ ఫుడ్ లో వాడే ఆడ్ ఆన్ లు.

సొయా సాస్, గ్రీన్ చిల్లి సాస్, గార్లిక్ జింజర్ పేస్ట్ (డబ్బాలలో నిల్వ చేసినవి... అప్పటికప్పుడు చేసిన ఫ్రెష్ వెల్లుల్లి అల్లం పేస్ట్ కాదు) రెడ్ చిల్లి సాస్ , ఇంకా కృతిమ రంగులు, రుచి పెంచడానికి వాడే రసాయనాలు, ఆహార పదార్థాలు పాడవకుండా నిల్వయుండడానికి వాడే రసాయనాలు.

ఏవో కొన్ని తప్పించి హోటల్స్ లు దొరికే ఆహార పదార్థాల్లో ఉండే రసాయనాలు. వాటిని తరచూ తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు.

1 . అసిటిక్ ఆసిడ్ :

ప్రతి సాస్ లో తప్పక ఉంటుంది. అసిడిటీని పెంచుతుంది. గ్యాస్టిక్ సమస్య, అల్సర్, గెర్డ్ సమస్య వున్నవారికి అదనంగా గుండెలో మంట. అసిటిక్ ఆసిడ్ దంతాలపై ఉన్న ఎనామెల్ ను తినేస్తుంది.

2. సోడియం బెంజోయెట్ :

ప్రతి సాస్ లో ఉంటుంది. బెంజీన్ కాన్సర్ కారకం. సాస్ బాటిల్ ను ఫ్రిజ్ లో ఉంచాలి. కానీ నూటికి 90 శాతం హోటల్స్ ఈ నిబంధన పాటించవు. రూమ్ టెంపరేచర్ లో కిచెన్ వేడికి బెంజీన్ విడుదల కావడం ఖాయం.

3. సోడియం మెటా సల్ఫయిట్ :

చీలి సాస్ లో ఉంటుంది. తలనొప్పి కడుపు నొప్పి కి కారణం, ఇది కాకుండా బి 1 విటమిన్ ను ఇది నాశనం చేస్తుంది.

4. కార్మెల్ కలర్ :

సొయా సాస్ డార్క్ సోడా లాంటి వాటిలో రంగు కోసం వాడుతారు . కాన్సర్ కారకం .

5. p 4R / E 124 :

పిల్లలో హైపర్ ఆక్టివిటీ కలుగచేస్తుంది . కాన్సర్ కారకం.

6. బ్రిలియంట్ బ్లూ / సన్ సెట్ యెల్లో :

పిల్లల్లో హైపర్ ఆక్టివిటీ.

7. మోనో సోడియం గ్లుటామేట్ :

హోటల్ లో దొరికే ప్రతి ఫుడ్ లో రుచిని పెంచడం కోసం వాడుతారు.

అనేక ఆరోగ్య సమస్యలు.

8. హై సోడియం :

బిపి, కిడ్నీ సమస్యలు.

9 E 621 :

మంచూరియన్ ఫ్రైడ్ రైస్, సూప్, పనీర్ స్నాక్స్, బిర్యానీ తయారీ లో వాడుతారు. అనేక ఆరోగ్య సమస్యలను కలుగచేస్తుంది.

10. డిసోడియం ఐనోసినట్ E 631 :

ఇన్స్టంట్ నూడుల్స్, చిప్స్ లో వాడుతారు. అనేక గ్రేవీ ఐటమ్స్ తయారీ లో వాడుతారు. ఇది చేపలు మొదలయిన నాన్ వెజ్ ఫుడ్ నుంచి సేకరించింది. అనేక అనారోగ్య సమస్యలు.

11. టార్ట్రేజినె E 102 ఎల్లో :

పసుపు లాంటి రంగు ఇవ్వడానికి పోహా, పులావ్, బిర్యానీ , స్వీట్స్ లో వాడుతారు . ఆస్తమా ఎలర్జీ హైపర్ ఆక్టివిటీ.

12 కర్మసాయినే E 122 :

తందూరీ ఫుడ్స్ లో ఎరుపు రంగు కోసం వాడుతారు. దీని విదేశాల్లో నిషేదించారు. ఎలర్జీ ఆస్తమా కలుగచేస్తుంది...

రాస్తూ పొతే రసాయనాల లిస్ట్ కొండవీటి చేంతాడు అవుతుంది.

ఇంటిలో తయారు చేసే ఆహారం లో రుచి కోసం మనంవాడే ... అల్లం, వెల్లుల్లి, కొత్తిమిరి, పసుపు, ఇంగువ, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు, సోంపు, ఆవాలు, ఎండు కొబ్బరి, ద్రాక్ష, ఏలకులు, లవంగాలు... దివ్య ఔషధాలు.

ఎన్నో తరాల అనుభంతో ఆహారాన్ని ఔషధంగా పూర్వీకులు మనకు అందించారు.

మిడిమిడి జ్ఞానంతో రుచి పేరుతొ హాలాహలం లాంటి రసాయనాలను తిని నేటి మానవులు సంపాదించిన ఆస్తి ఆసుపత్రుల పాలు చేస్తున్నారు .

కాన్సర్ ... ఆస్తమా... ఎలర్జీ... గ్యాస్టిక్ సమస్య... పిల్లల్లో హైపర్ ఆక్టివిటీ... ఎందుకు భారీగా ఎరిగి పోతున్నాయో అర్ధమయ్యిందా ?

కాన్సర్ రాకుండా ఉండాలంటే టెస్ట్ లు చేసుకోండి అని చెబుతున్నవారు.. కాన్సర్ కారకమయిన రసాయనాలు తినొద్దు అని ఎందుకు చెప్పరు ? ఆలోచించండి.

చివరిగా ఒక మాట.

బాల్యం లో తిన్న ఫుడ్ టేస్ట్ మెదడులో పీట వేసుకొని కూర్చుంటుంది. రసాయన రుచులకు అలవాటు పడిన పిల్లలు సహజ ఆహారాన్ని ఎంజాయ్ చేయలేరు. పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వడమంటే వారి బతుకును మొగ్గలో తుంచేయడమే .

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dosa Mix: ఇదొక్క పొడి రెడీ చేసుకుంటే.. పప్పు రుబ్బేపని లేకుండా క్రిస్పీ , టేస్టీ దోశలు రెడీ
Milk: ఈ పొడి చిటికెడు వేస్తే.. పాలు రెండు, మూడురోజులైనా విరిగిపోవు..!