Veg Biryani Recipe: బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు. సరైన మసాలాలు, కూరగాయలతో గుమగుమలాడే బిర్యానీని తక్కువ టైంలోనే రెడీ చేయవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
Veg Biryani at Home: వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ రెండూ టేస్టులో అదిరిపోతాయి. కానీ చాలామంది పిల్లల కోసం ఎక్కువగా ఇంట్లో వెజ్ బిర్యానీ తయారు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎప్పుడూ వంట చేయని వాళ్లు కూడా దీన్ని ఈజీగా ట్రై చేయవచ్చు. మరి ఆలస్యమెందుకు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందామా..
వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు
ఉడికించిన అన్నం – 2 కప్పులు
మిక్స్డ్ కూరగాయలు – 3 కప్పులు
పసుపు – 1/2 టీస్పూన్
ధనియాల పొడి – 2 టీస్పూన్లు
తరిగిన ఉల్లిపాయలు – 1/4 కప్పు
తరిగిన అల్లం – 1 టీస్పూన్
తరిగిన వెల్లుల్లి – 5-6 రెబ్బలు
తాజా కొత్తిమీర – 2-3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి – 1-2
జీలకర్ర – 1 టీస్పూన్
కారం పొడి – 1/2 టీస్పూన్
గరం మసాలా – 1/2 టీస్పూన్
బిర్యానీ మసాలా – 1 టీస్పూన్
నూనె – సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – 1 టీస్పూన్
తినేవాళ్ల సంఖ్యను బట్టి ఈ పదార్థాల మోతాదును పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు.
వెజ్ బిర్యానీ తయారీ విధానం: స్టెప్-బై-స్టెప్ గైడ్
ముందుగా, ఒక లోతైన గిన్నె తీసుకుని అందులో బియ్యం వేసి ఉడికించుకోవాలి.
అన్నం ఉడికేలోపు, తాజా కూరగాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి, తాజా కొత్తిమీర, పచ్చిమిర్చిని తరిగి పక్కన పెట్టుకోవాలి. వీటిని తర్వాత వాడాలి.
ఇప్పుడు, ఒక ఫ్రైయింగ్ పాన్ లేదా కడాయి తీసుకుని, అందులో కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక, తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి.
ఉల్లిపాయ, వెల్లుల్లి గోల్డ్ కలర్ లోకి రాగానే, మిగిలిన కూరగాయలను కూడా వేసి వేయించుకోవాలి.
అన్నీ వేగిన తర్వాత, పసుపు, ధనియాల పొడి, కారం సహా అన్ని మసాలాలు వేసి మిశ్రమాన్ని వేయించాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి.
ఈ మిశ్రమం బాగా వేగి, రెడీ అయ్యాక.. అందులో సగం ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు, పాన్‌లో మిగిలిన మిశ్రమంపై ఒక లేయర్‌గా అన్నం పరవాలి.
ఆ తర్వాత, అన్నంపై ఉడికించిన కూరగాయల మిశ్రమాన్ని మరో లేయర్‌గా వేయాలి. దానిపై చివరి లేయర్‌గా మళ్లీ అన్నం వేసి, పాన్‌పై మూత పెట్టాలి.
ఇక మీరు చేయాల్సింది ఏమీ లేదు. పాన్‌ను మీడియం ఫ్లేమ్ పై 5-7 నిమిషాలు ఉంచాలి.
సమయం పూర్తయ్యాక, తాజా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఈ డిష్‌ను రైతాతో కలిపి తింటే ఇంకా బాగుంటుంది.