సోషల్ మీడియాలో పేరెందుకు మార్చారు... సమంత ఆవేశపూరిత సమాధానం!

By team teluguFirst Published Sep 2, 2021, 3:24 PM IST
Highlights

సమంత సామాజిక మాధ్యమాల్లో పేరెందుకు మార్చుకుంది? ఈ విషయం నెట్టింట హాట్‌ టాపిక్‌ అయింది. సోషల్ మీడియాలో తాను పేరెందుకు మార్చుకున్నారనే విషయంపై సమంత ఈ విధంగా స్పందించారు. 


క్యూట్ గా కనిపించే సమంత యాటిట్యూడ్ మాత్రం బోల్డ్ అని చెప్పాలి. నచ్చినట్లు ఉండాలనే సిద్ధాంతం గట్టిగా నమ్మే సమంత, ఇతరుల కామెంట్స్ అసలు పట్టించుకోదు. అలాగే మనసులో భావం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉన్న దశలోనే హీరో, హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ వ్యత్యాసంపై సమంత ఓపెన్ గా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీ విజయంలో హీరోతో పాటు, హీరోయిన్ కి సమాన కాంట్రిబ్యూషన్ ఉంటుందని, రెమ్యూనరేషన్స్ లో మాత్రం అసలు పొంతన ఉండదని ప్రశ్నించారు. 


కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న హీరోయిన్స్ ఎవరూ, ఇలాంటి వ్యాఖ్యలు చేసి రిస్క్స్ కొని తెచ్చుకోవాలి అనుకోరు. సమంత మాత్రం ఎవరికీ భయపడకుండా ఆ ఇష్యూ రైజ్ చేశారు. కాగా కొన్ని రోజులుగా సమంతపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె సోషల్ మీడియాలో పేరు మార్చుకోగా, చైతు, నాగ్ లతో విబేధాలే కారణం అంటూ ప్రచారం సాగుతుంది. నాగ్ బర్త్ డే వేడుకలలో సమంత లేకపోవడం, ఈ అనుమానాలు మరింత పెంచేశాయి. 


కాగా సోషల్ మీడియాలో తాను పేరెందుకు మార్చుకున్నారనే విషయంపై సమంత ఈ విధంగా స్పందించారు. సమంత సామాజిక మాధ్యమాల్లో పేరెందుకు మార్చుకుంది? ఈ విషయం నెట్టింట హాట్‌ టాపిక్‌ అయింది. ట్రోల్స్‌ వస్తున్నాయి. దానిపై స్పందించాలని నేను అనుకోవడం లేదు. ఇప్పుడే కాదు ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2 విడుదలైన సమయంలోనూ విమర్శలు ఎదురయ్యాయి. దీని గురించి ఏదైనా చెప్పండి అంటూ కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా కోరారు. ఇందుకు సుమారు 65,000 ట్వీట్లు పెట్టారు. కానీ, నాకు జవాబు ఇవ్వాలనిపించలేదు. సంబంధిత విషయాలపై నాకు మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతా. అని అసలు కారణం బయటపెట్టకుండానే విషయం ముగింసింది. 

click me!