'నిశ్శబ్దం' ని అనుష్క ఓకే చేయటం వెనక ఇంత కథ

By Surya PrakashFirst Published Oct 11, 2020, 12:23 PM IST
Highlights

ఈ సినిమా ప్లాఫ్ కావటం అనుష్క కెరీర్ కు పెద్ద దెబ్బే అంటన్నారు. అయినా సినిమా కథల ఎంపికలో ఎప్పుడో కానీ దారి తప్పని అనుష్క..ఎలా ఈ ప్రాజెక్టు చేసింది అని సందేహపడుతున్నారు.
 

అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ నెల 2న ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చాయి. మంచి నటీనటులు ఉన్నప్పటికీ, కథలో లోపం వలన సినిమా అంత మెప్పించలేకపోయిందంటూ అందరూ అన్నారు. ఈ సినిమా ప్లాఫ్ కావటం అనుష్క కెరీర్ కు పెద్ద దెబ్బే అంటన్నారు. అయినా సినిమా కథల ఎంపికలో ఎప్పుడో కానీ దారి తప్పని అనుష్క..ఎలా ఈ ప్రాజెక్టు చేసింది అని సందేహపడుతున్నారు.

అయితే అందుతున్న సమాచారం మేరకు.. ఈ సినిమాను మొదట అనుష్క చేయాల్సింది కాదట. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ కథను మొదట రెజీనా కసాండ్రాకు చెప్పాడట. కథను పూర్తిగా ఒక సైలెంట్ ఫిల్మ్ గా తెరకెక్కించాలని అనుకున్నారట. ఒక్క మాట కూడా లేకుండా స్క్రీన్ ప్లే మేకింగ్ తోనే ఆడియేన్స్ కి సరికొత్త థ్రిల్ ఇవ్వాలని అనుకున్నారు. రెండేళ్ల క్రితం చిన్న బడ్జెట్ లోనే ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో PVP ప్రొడక్షన్ తో కలిసి సినిమాను తెరకెక్కించాలని హేమంత్ ఒక ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఆ తరువాత కథ గురించి తెలుసుకున్న కోన వెంకట్ దర్శకుడి ఆలోచన విధానాన్ని మొత్తం మార్చేశాడంటున్నారు. 

అనుష్క ని సీన్ లోకి తీసుకొచ్చి పెద్ద ప్రాజెక్టు చేసారని, దాంతో సినిమా రూపు రేఖలే మారిపోయాయని అదే దెబ్బ కొట్టిందని చెప్తున్నారు. అనుష్క ఈ సినిమాలో చేయటానికి ఏమీ లేకుండా పోయిందని, కోన వెంకట్ ని నమ్మి ప్రాజెక్టులోకి అడుగు పెట్టిందని చెప్తున్నారు ఈ మహమ్మారి సమయంలో చేసిన ఫ్లాఫ్ తో  ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారామె. అతి త్వరలోనే పెద్ద బ్యాంగ్ తో త్వరలో తిరిగి వస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
 

click me!