Chiranjeevi- Lokesh Kanagaraj: చరణ్ కోసం చిరంజీవి పైరవీలు ... లోకేష్ కనకరాజ్ స్పష్టత!

Published : Jun 23, 2022, 02:59 PM IST
Chiranjeevi- Lokesh Kanagaraj: చరణ్ కోసం చిరంజీవి పైరవీలు ... లోకేష్ కనకరాజ్ స్పష్టత!

సారాంశం

చరణ్ తో మూవీ చేయాలంటూ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ని చిరంజీవి ఒత్తిడి చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్వయంగా స్పందించారు.   


కొడుకుని ఉన్నత స్థాయిలో చూడాలని ఏ తండ్రికైనా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా అదే కోరుకుంటారు అనడంలో సందేశం లేదు. చరణ్ మూవీ సెలెక్షన్స్ లో చిరంజీవి హస్తం ఉంటుంది. ఇంతవరకు ఓకె.  ఫార్మ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ ని చిరంజీవి ఒత్తిడి చేస్తారనే ఓ అపవాదు ఉంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ చరణ్ తో సినిమాలు చేసేలా పైరవీలు నడుపుతాడట. ఇదే తరహా రూమర్ తాజాగా తెరపైకి వచ్చింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కొడుకు చరణ్ తో మూవీ చేయాలని ఒత్తిడి చేశారట. లోకేష్ నుండి ఆయన మాట తీసుకున్నారట. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. 

ఈ వార్తలపై లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj)స్పందించారు. చరణ్ తో మూవీ చేయాలంటూ చిరంజీవి గారు నన్ను ఒత్తిడి చేశాడన్న పుకార్లు జస్ట్ నాన్సెన్స్. చిరంజీవి గారు డిన్నర్ కి పిలవక ముందే చరణ్, నేను ఒకటి రెండు సార్లు కలిశాము. చరణ్ నాకు మంచి మిత్రుడు రెగ్యులర్ గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము. ఇక చిరంజీవి గారితో డిన్నర్ నైట్ లో పాల్గొన్న సమయంలో చరణ్ ఇంట్లో కూడా లేరు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయకండి అంటూ.. లోకేష్ కనకరాజ్ స్పష్టత ఇచ్చారు. 

ఇటీవల చిరంజీవి ఆహ్వానం మేరకు కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ ఆయన నివాసానికి వచ్చారు. వారిని సత్కరించిన చిరంజీవి మంచి డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో సల్మాన్ ఖాన్ సైతం పాల్గొన్నారు. ఆ రోజు చిరంజీవి లోకేష్ కనకరాజ్ తో ఈ ప్రపోజల్ పెట్టారనేది పుకారు. లోకేష్ స్వయంగా స్పందించి వాటికి చెక్ పెట్టారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చరణ్ నటించడం ఖాయమన్న మాట వినిపిస్తుంది. ఇటీవల విక్రమ్ సీక్వెల్ లో చరణ్(Ram Charan)కమల్ హాసన్ మనవడి పాత్ర చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఇక విక్రమ్ మూవీతో లోకేష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. ఎటువంటి అంచానాలు లేకుండా విడుదలైన విక్రమ్ దాదాపు రూ. 400 కోట్ల వసూళ్లకు చేరువైంది. ఈ క్రమంలో లోకేష్ తో మూవీ చేయడానికి స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌