‘ఉప్పెన’ లో విజయ్ సేతుపతి లుక్‌..చూసారా

By Surya PrakashFirst Published Apr 1, 2020, 4:14 PM IST
Highlights

 ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో విజయ్ సేతుపతి లుక్ ని వదిలారు.


సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌  హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో  దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపించి వైష్ణవ్‌ సినీ ప్రియులను మెప్పించారు.అలాగే ఫస్ట్ లుక్ లో  వైష్ణవ్‌ మాస్‌, లవర్‌బాయ్‌ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో విజయ్ సేతుపతి లుక్ ని వదిలారు.

RAYANAM 😎 pic.twitter.com/TQdrkBSm3H

— Mythri Movie Makers (@MythriOfficial)

ఇక చేతిలో సిగరెట్‌ పట్టుకొని కుర్చిలో కూర్చున్న విజయ్‌ సేతుపతి మాస్‌లుక్‌ ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాపై అంచనాలు పెంచుతోంది. ‘రాయనం' అనే డిఫరెంట్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.  

 మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో ఎప్పుడు రిలీజ్ అనేది చెప్పలేని పరిస్దితి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.
 

click me!