విజయ్ దేవరకొండను గుర్తుపట్టలేదట!

Published : Oct 05, 2018, 05:47 PM ISTUpdated : Oct 05, 2018, 06:20 PM IST
విజయ్ దేవరకొండను గుర్తుపట్టలేదట!

సారాంశం

అయితే తమిళ జనాలను కూడా ఎక్కువగా ఆకట్టుకోవాలని సింపుల్ గా ఆటోలో దర్శనమిచ్చాడు. రాత్రి సమయంలో రోడ్డు పై సాధారణ వ్యక్తిలా ఆటోలో వెళుతూ దేవరకొండ ఇంటర్వ్యూ ఇచ్చాడు

వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న విజయ్ దేవరకొండ మొదటి పొలిటికల్ సినిమా నోటాను నేడు విడుదల చేశాడు. తెలుగుతో పాటు తమిళ్ కూడా సినిమాను భారీగా రిలీజ్ చేశారు. తెలుగులో అర్జున్ రెడ్డి కారణంగా వచ్చిన స్టార్ డమ్ ను చూసి తమిళ జనాలు కూడా విజయ్ కి ఫ్యాన్స్ అయ్యారు. సినిమాకు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. 

అయితే తమిళ జనాలను కూడా ఎక్కువగా ఆకట్టుకోవాలని సింపుల్ గా ఆటోలో దర్శనమిచ్చాడు. రాత్రి సమయంలో రోడ్డు పై సాధారణ వ్యక్తిలా ఆటోలో వెళుతూ దేవరకొండ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతనిని పెద్దగా ఎవరు గుర్తుపట్టలేదు. అయితే ఒక దగ్గర చాయ్ తాగడానికి ఆటో దిగగా పోలీసులు వచ్చి అందరూ ఇక్కడినుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే విజయ్ ని అక్కడి పోలీసులు గుర్తుపట్టలేదు. 

రౌడీ అనే ట్యాగ్ డైలాగ్ తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విజయ్ తమిళ జనాలను కూడా తన సింపుల్సిటీ తో ఆకట్టుకున్నాడు. ఇక నోటా విజయం సాధిస్తే కోలీవుడ్ లో విజయ్ కి మంచి క్రేజ్ వచ్చినట్టే.. మరి ఆ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.  

 

సంబంధిత వార్తలు 

టాటా...( ‘నోటా‌’ మూవీ రివ్యూ )

రాజకీయం తుస్సు: నోటాకు అంత సీన్ లేదు

విజయ్ దేవరకొండ 'నోటా'.. ప్రశంసలతో పాటు విమర్శలు!

'నోటా' ట్విట్టర్ టాక్..!

కేటీఆర్ లుక్స్ ని మక్కీ మక్కీ దింపా: నోటా సినిమాపై విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ 'నోటా' టార్గెట్ ఎంతంటే..?

రష్మిక బ్రేకప్ పై విజయ్ దేవరకొండకి ఊహించని ప్రశ్న!

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి