కో డైరెక్టర్ తో సంచలన హీరోయిన్ సీక్రెట్ రిలేషన్!

Published : Oct 05, 2018, 04:55 PM IST
కో డైరెక్టర్ తో సంచలన హీరోయిన్ సీక్రెట్ రిలేషన్!

సారాంశం

ఒకప్పుడు తమ సహనటులతో ప్రేమాయణాలు సాగించే హీరోయిన్లు ఇప్పుడు దర్శకులు, నిర్మాతలతో పాటు కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లతో కూడా అఫైర్లు సాగిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన బయటకొచ్చింది. ఓ యంగ్ హీరోయిన్ కో డైరెక్టర్ తో అఫైర్ సాగించడం ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

డిల్లీ నుండి టాలీవుడ్ కి వచ్చిన ఈ బ్యూటీ కేవలం ఒక సినిమాలోనే నటించింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ తార గ్లామర్ షో విషయంలో తనకు ఎలాంటి హద్దులు లేవంటూ బోల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది.

హీరోతో ఆమె చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ కి యూత్ ఫిదా అయిపోయింది. మొదటి సినిమాతోనే సంచలన హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ భామ తన మొదటి సినిమాకి కో డైరెక్టర్ గా పని చేసిన వ్యక్తితో అఫైర్ పెట్టుకుందట.

పలు సినిమాలకు పని చేసిన ఆ కో డైరెక్టర్ కి ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుల దగ్గర కూడా అతడు పని చేశాడు. అతడి పరిచయాలను వాడుకొని మరిన్ని సినిమా ఆఫర్లు దక్కించుకోవాలని చూస్తోంది సదరు బ్యూటీ.

అయితే వీరి రిలేషన్ షిప్ ఎక్కడ బయటపడుతుందా..? అని చాలా సీక్రెట్ గా మైంటైన్ చేస్తున్నారట. ఎంత సీక్రెట్ గా చేస్తున్నా.. విషయం మాత్రం బయటకి పొక్కింది. మరి ఈ బంధాన్ని ఎంతకాలం కొనసాగిస్తారో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Trisha Krishnan: ఇక నా టైమ్‌ స్టార్ట్ అయ్యింది, తమిళనాట విజయ్‌ సంచలనం వేళ త్రిష పోస్ట్ దుమారం
JD Chakravarthy: బ్రహ్మానందం నన్ను చాలా టార్చర్ చేశాడు.! ఓపెన్‌గా చెప్పేసిన జేడీ చక్రవర్తి