టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముగిసిన ముమైత్ ఖాన్ విచారణ.. ఎఫ్ క్లబ్ పార్టీపై ఆరా

By Siva KodatiFirst Published Sep 15, 2021, 5:19 PM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటి ముమైత్ ఖాన్ ఈడీ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ముమైత్ బ్యాంక్ ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించారు. అలాగే ఎఫ్ క్లబ్ పార్టీల్లో జరిగిన డ్రగ్స్ సరఫరాపైనా ముమైత్‌ను ప్రశ్నించారు. ఎఫ్ క్లబ్ జీఎం, ముమైత్‌కు మధ్య ఆర్ధిక లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు 12 మంది సినీ నటులకు నోటీసులు ఇచ్చారు.ఈ నోటీసులు అందుకొన్నవారిని ఈడీ ప్రశ్నిస్తోంది. గతంలో ఎక్సైజ్ శాఖ విచారించినవారితో పాటు ఎక్సైజ్ శాఖ విచారించని రకెుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాలను కూడ ఈడీ విచారించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో  తొలుత దర్శకుడు పూరీ జగన్నాథ్, సినీ తారలు ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్,  నందు,  దగ్గుబాటి రానా, రవితేజ,నవదీప్ లను ఈడీ ప్రశ్నించింది. ఇవాళ ముమైత్ ఖాన్  ఈడీ విచారణను ఎదుర్కొంటుంది.ఈడీ విచారణకు హాజరైన వారిలో ఎక్కువ మంది 8 నుండి 10 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు.

Also Read:టాలీవుడ్ డ్రగ్స్ కేసు: 9 గంటల పాటు నవదీప్ విచారణ, ఎఫ్ క్లబ్ ఆర్ధిక లావాదేవీలపై ఆరా

డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని  ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో విచారణకు హాజరయ్యే  సినీ తారల బ్యాంకు ఖాతాలను తీసుకురావాలని ఈడీ అధికారులు కోరారు.ఇవాళ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్ తన ఆడిటర్ తో పాటు బ్యాంకు ఖాతాలను తీసుకొచ్చింది. ముంబై నుండి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ముమైత్ ఖాన్ చేరుకొంది. అక్కడి నుండి క్యాబ్ లో ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకొంది.డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడు కెల్విన్ తో ముమైత్ ఖాన్ కు ఉన్న లింకులపై  ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు

click me!