పోర్న్ సినిమా ట్రైలర్‌లా.. మొత్తం నగ్నమే!

By Surya PrakashFirst Published Jun 21, 2020, 9:47 AM IST
Highlights

రీసెంట్ గా 'క్లైమాక్స్' అంటూ పోర్న్ స్టార్ మియా మాల్కోవాను ఎడారి లోకి తీసుకెళ్లి రకరకాల యాంగిల్ లో చూపించి డబ్బులు పంట పండించుకున్న వర్మ మరోసారి అదే విధానం ఫాలో అవుతున్నారు. ఈ సారి డోస్ పెంచి 'నగ్నం' (NAKED) అంటూ మరో అడల్ట్ మూవీని రెడీ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో ఈ చిత్తరం రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన కట్ చేస్తున్న ట్రైలర్స్ షాక్ ఇస్తున్నాయి.

వివాదాల కేరాఫ్ అడ్రస్ తనను తాను ప్రొజెక్టు చేసుకునే రామ్ గోపాల్ వర్మ సినిమాల్లోనూ అదే విధానం ఆశ్రయిస్తున్నారు. రీసెంట్ గా 'క్లైమాక్స్' అంటూ పోర్న్ స్టార్ మియా మాల్కోవాను ఎడారి లోకి తీసుకెళ్లి రకరకాల యాంగిల్ లో చూపించి డబ్బులు పంట పండించుకున్న వర్మ మరోసారి అదే విధానం ఫాలో అవుతున్నారు. 

ఈ సారి డోస్ పెంచి 'నగ్నం' (NAKED) అంటూ మరో అడల్ట్ మూవీని రెడీ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో ఈ చిత్తరం రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన కట్ చేస్తున్న ట్రైలర్స్ షాక్ ఇస్తున్నాయి. రీసంట్ గా ఈ నగ్న సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల చేత ''వామ్మో!'' అనిపించుకున్న ఆయన ఇప్పుడు సెకండ్ ట్రైలర్ వదిలారు. ఈ ట్రైలర్ లో ప్రతీ సెకండు బూతుని ప్రొజెక్టు చేస్తూనే ఉన్నారు. మీరు ఇక్కడ ఈ ట్రైలర్ ని చూడండి.

ఈ సినిమాని నేకెడ్, నంగీ, నగ్నం పేర్లతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తీస్తున్నాడు. అది కూడా త్వరలో విడుదల కాబోతున్నది. ఆ మధ్య పొలిటికల్ సెటైర్లు తీసి బొక్క బోర్లా పడ్డ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు రాజకీయం బాట వదిలి పెట్టి రొమాన్సు, వైయలెన్సు వైపు చూస్తున్నాడు. ఈయన్ని చూసి మరింత మంది ప్రేరణ పొందబోతున్నారు. కరోనాతో ప్రపంచం అల్ల కల్లోలం అవుతున్న టైమ్ లో కరోనా వైరస్ పేరుతో హారర్ చిత్రం తీసి రిలీజ్ కు రెడీ చేసారు రామ్ గోపాల్ వర్మ.

click me!