అవుట్ అండ్ అవుట్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘కళాపురం’. నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం రోజురోజుకు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. తాజాగా సెన్సార్స్ కూడా పూర్తి చేసుకుంది.
ప్రతి సినిమా కి రిలీజ్ కు ముందే క్రియేట్ అయ్యే బజ్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం రోజురోజుకు ఇంట్రెస్టింగ్ ను క్రియేట్ చేస్తూ రీచ్ పెంచుకుంటున్న చిత్రం ‘కళాపురం’ (Kalapuram). చిత్ర ప్రమోషన్స్ ను యూనిట్ క్రేజీగా నిర్వహిస్తుండటంతో సినిమాపై రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది. రియలిస్టిక్ కామెడీ తో దర్శకుడు కరుణ కుమార్ చేసిన ఈ ప్రయత్నం అందరి దృష్టినాకర్షిస్తుంది. ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా కథను నమ్ముకొని చేసినవే. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలలో కథే ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు చేసిన కళాపురం కూడా ఆ వరుసలోనే నిలబడుతుంది.
సినిమా ఇండస్ట్రీ ని డ్రీమర్స్ హాంట్ అంటారు. ప్రతి ఒక్కరు తమ కలలను ఛేంజ్ చేసుకుంటూ ఇక్కడికి చేరతారు. అలా చేరిన ఒక స్ట్రగులింగ్ డైరెక్టర్ జీవితంలో వచ్చిన ఒక సినిమా అవకాశం చుట్టూ కరుణ కుమార్ అల్లిన రియలిస్టిక్ కామెడీ కళాపురం కు కొత్త లుక్ ని అందించింది.
సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా లో హాస్యం పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. కామెడీగా చాలా ఆరోగ్యకరంగా ప్రజెంట్ చేయబడుతుందని దర్శకుడు భరోసా ఇస్తున్నాడు. కొత్త కథలు, కొత్త కథనాలు ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘కళాపురం’ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందనే గ్యారెంటీ ట్రైలర్ తో కలిగింది. ఈ కథలో దొరికిన కొత్త సిట్యూవేషన్స్ , ఆ సిట్యు వేషన్స్ లో పడిన ఆర్టిస్ట్ లు కళాపురంలో నవ్వుల విందు పంచుతారు. సెన్సార్ రిపోర్ట్ కూడా కళాపురం పై అంచనాలను పెంచింది. దర్శకుడు కరుణ కుమార్ ముందు చేసిన రెండుసినిమాల కథలు సీరియస్ ఇష్యూ పై నడిస్తే ఈ కళాపురం పూర్తి వినోదం ప్రధానంగా సాగుతుంది. ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రియలిస్టిక్ కామెడీ సరదాగా ప్రేక్షకుల్ని నవ్వింస్తుందనే నమ్మకం కలుగుతుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు, ట్రైలర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంనేలా ఉన్నాయి. ఈ సందర్భంగా తాజాగా చిత్రం సెన్సార్స్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. దీంతో యూనిట్ ఫుల్ ఖుషీ అవుతోంది. ‘ఎవరి పోరాటానికి గుర్తింపు దక్కదు. కళాపురం యూ/ఏ సర్టిఫికేట్ పొందడం సంతోషంగా ఉంది. సమీపంలోని థియేటర్లలో ఈ వినోదభరితమైన చిత్రాన్ని వీక్షించండి’ అని ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ఈజీ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుందని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఆగస్టు 26న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
No one’s struggle shall go unnoticed ❤️ certified with U/A
Experience the fun-filled ride in cinemas near you 🤩
Grand release on August 26. pic.twitter.com/hWBuv3pMJN