‘సైరా నరసింహారెడ్డి’ఫస్ట్ సక్సెస్.. ప్రభుత్వంలో కదలిక

By Prashanth MFirst Published Sep 25, 2019, 8:34 AM IST
Highlights

ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై సురేఖ సమర్పణలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చారిత్రక యుద్ధ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ క్రియేట్ అయ్యింది. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. 

ఈ తరం మర్చిపోయిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన జీవితకథకు దృశ్య రూపమిచ్చి ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్ తో  విడుదలకు సిద్దం చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై సురేఖ సమర్పణలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చారిత్రక యుద్ధ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ క్రియేట్ అయ్యింది. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి, వర్ధంతి ఉత్సావాలను ఘనంగా జరపాలని నిర్ణయించుకుందని సమాచారం. ఈ మేరకు జీఓ త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. ఇది సైరా సినిమా సాధించిన మొదట విజయం గా చెప్పాలి.

చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఏ కథ అయినా అనుకుని అద్భుతంగా అల్లుకుని సెట్స్‌పైకి తీసుకెళతాం. కానీ, ‘సైరా’ అలాంటిది కాదు.  పుష్కరానికి ముందు పరుచూరి బ్రదర్స్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పారు. ఆయన గురించి కర్నూలుతో పాటు చుట్టుపక్కన ఉన్న జిల్లాల్లోని కొందరికి తప్ప ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఆ టైమ్‌లో నాకూ పెద్దగా తెలియలేదు. నాకు తెలిసినవారిని అడిగినా మాకూ తెలియదన్నారు.

ఆయనకు సంబంధించిన కొన్ని పేజీలు, బుర్ర కథలు, ఒగ్గు కథలున్నాయి తప్ప ఆయన గురించి పెద్దగా ప్రాచుర్యం ఏ ప్రాంతానికీ పాకలేదు. కానీ, కథ విన్నప్పుడు అద్భుతమైన కథ, ఓ గొప్ప యోధుడు అనిపించింది. తెరమరుగైపోయిన, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి కథని అందరికీ తెలియజేయాలని సినిమా తీశాం అన్నారు.మన తెలుగువాడైన నరసింహారెడ్డివంటివారి కథ తెరమరుగైపోకూడదు అని మైండ్‌లో గట్టిగా ఉండిపోయింది.  ‘సైరా’వంటి సినిమా చేయడం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం.. మీకు చూపించడం ఎంతో పుణ్యం ’’అన్నారు చిరంజీవి.

చిరంజీవి, నయనతార జంటగా అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న విడుదలవుతోంది.

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!

click me!