ప్రభాస్ జాన్..  విలన్ గా స్టార్ యాక్టర్

Published : Sep 25, 2019, 08:20 AM IST
ప్రభాస్ జాన్..  విలన్ గా స్టార్ యాక్టర్

సారాంశం

సాహో టాలీవుడ్ తో తమిళ్ కూడా సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. మొదట ఓ వర్గం నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అర్ధం లేని స్క్రీన్ ప్లేతో దర్శకుడు తొందరపడినట్లు టాక్ వచ్చింది. ఇకపోతే సాహో ఎఫెక్ట్ నుంచి కాస్త బయటపడేందుకు ప్రభాస్ తన జాన్ సినిమాతో బిజీ అవ్వాలని అనుకుంటున్నాడు.

సాహో సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో సక్సెస్ అందుకున్నప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. సాహో టాలీవుడ్ తో తమిళ్ కూడా సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. మొదట ఓ వర్గం నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అర్ధం లేని స్క్రీన్ ప్లేతో దర్శకుడు తొందరపడినట్లు టాక్ వచ్చింది. 

ఇకపోతే సాహో ఎఫెక్ట్ నుంచి కాస్త బయటపడేందుకు ప్రభాస్ తన జాన్ సినిమాతో బిజీ అవ్వాలని అనుకుంటున్నాడు. రీసెంట్ గా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళాడు. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడంతో పూర్తి నటీనటులను చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసుకుంటోంది. సినిమాలో విలన్ రోల్ కోసం జగపతి బాబును ఫిక్స్ చేసినట్లు సమాచారం. 

ప్రస్తుతం సౌత్ లో స్టార్ విలన్ గా అలాగే డిఫరెంట్ పాత్రలతో అలరిస్తున్న జగ్గూ భాయ్ ప్రభాస్ తో కూడా పోటీ పడేందుకు సిద్దమవుతున్నాడు. రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాకు జాన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేయనున్నారు. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని ప్రభాస్ చిత్ర యూనిట్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Suriya 46 Movie: సూర్య 46కి, గజినీకి సంబంధం ఏంటి? అంచనాలు పెంచేసిన నిర్మాత సమాధానం
2025 లో రియల్ లైఫ్ స్టోరీలతో వచ్చిన 6 సినిమాలు.. కొన్ని హిట్లు, కొన్ని వివాదాలు