బిగ్‌బాంబ్‌తో ప్రతీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్‌..అమ్మకి దిమ్మతిరిగిపోయింది!

Published : Oct 05, 2020, 08:53 AM IST
బిగ్‌బాంబ్‌తో ప్రతీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్‌..అమ్మకి దిమ్మతిరిగిపోయింది!

సారాంశం

స్వాతి నాల్గోవారం ఎలిమినేట్‌ అయ్యింది. గన్‌ టాస్క్ లో ఆమె వంతు వచ్చేటప్పుడు గన్‌ పేలింది. దీంతో హౌజ్‌ నుంచి వారం తిరగకుండానేవ ఎళ్ళిపోయింది. అయితే హౌజ్‌ సభ్యులపై అభిప్రాయాలు పంచుకుంటూ అమ్మ రాజశేఖర్‌ గురించి చెబుతూ, నమ్మకద్రోహి అని బాంబ్‌ పేల్చింది. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో మూడో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా స్వాతి దీక్షిత హౌజ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. రావడం రావడంతోనే అందరి హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ స్వాతికి ఫిదా అయ్యాడు. అందం అంటే ఇలా ఉంటుందా? అని ప్రశంసలతో ముంచెత్తాడు. 

దేవతగా కొనియాడాడు. మొత్తానికి బాగానే సోప్‌ వేశాడు. పులిహోరా కలిపాడు. కానీ నాల్గోవారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ చేసి షాక్‌ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్‌ నుంచి ఇలాంటి షాక్‌ తగులుతుందని స్వాతి ఊహించలేదు. 

కట్‌ చేస్తే, స్వాతి నాల్గోవారం ఎలిమినేట్‌ అయ్యింది. గన్‌ టాస్క్ లో ఆమె వంతు వచ్చేటప్పుడు గన్‌ పేలింది. దీంతో హౌజ్‌ నుంచి వారం తిరగకుండానేవ ఎళ్ళిపోయింది. అయితే హౌజ్‌ సభ్యులపై అభిప్రాయాలు పంచుకుంటూ అమ్మ రాజశేఖర్‌ గురించి చెబుతూ, నమ్మకద్రోహి అని బాంబ్‌ పేల్చింది. 

ఆ బాంబే కాదు బిగ్‌బాంబ్‌ కూడా ఆయనపైనే పేల్చింది. వచ్చే వారం హౌజ్‌ కెప్టెన్సీ  పోటీలో పాల్గొనకుండా ఉండేందుకు నామినేట్‌ చేసింది. ఇలా ప్రతీకారం తీర్చుకుంది. దీంతో అమ్మ రాజశేఖర్‌కి దిమ్మతిరిగిపోయింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?