చికాగో సెక్స్ రాకెట్.. ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది లేదు : సురేష్ బాబు

First Published Jun 21, 2018, 12:58 PM IST
Highlights

చికాగో సెక్స్ రాకెట్.. ఇండస్ట్రీ ఎలాంటి ఇబ్బంది లేదు

టాలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు రేపుతోన్న సెక్స్ రాకెట్‌పై తీగలాగితే డొంక కదులుతోంది. ఈ వ్యవహారంపై అమెరికాలో ఎఫ్‌బీఐ అధికారులు అన్నికోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. అమెరికాలో తెలుగు సంఘాల కార్యక్రమాలకు హాజరైన నటీనటుల వివరాలు సేకరించే పనిలోపడింది FBI. ఒక చిత్తు కాగితం ఆధారంగా నకిలీ తెలుగు సంఘాల బాగోతం కూడా బయటపడింది. దీనికి సంబంధించిన డేటాని కాన్సులేట్ నుంచి అధికారులు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరికొందరు నటీనటులకు కష్టాలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఇదిలావుండగా ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించాడు ప్రొడ్యూసర్ సురేష్‌బాబు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. అక్కడి వ్యవహారం టాలీవుడ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపదన్నారు. అమెరికాలో ఏం జరిగిందో మనకు తెలీదని.. కానీ, ఇక్కడి మీడియా మాత్రం ఆ రాకెట్‌లో ఓ ప్రొడ్యూసర్ వున్నాడని అనౌన్స్ చేసేసిందన్నారు. ఇంతకీ అతడు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఉన్నాడా? లేడా? అనేది ఎవరికీ తెలియదు.

యూఎస్ వెళ్లినవాళ్లు ఫిల్మ్ ఇండస్ర్టీకి చెందిన నటీనటులా? అనేది కూడా తెలియదు. ఇవేమీ తెలియకుండానే దాన్ని డ్రమటైజ్ చేసేసిన కొన్ని ఛానల్స్.. తమవద్దే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందని డబ్బా కొట్టుకుంటున్నాయని కౌంటర్ ఇచ్చారు. ఫ్లెష్ ట్రేడ్ మన సొసైటీలో ఉందా? లేదా? దీన్ని కొన్ని ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్ని చేయడంలేదన్నారు. ఓవరాల్‌గా ఇండస్ర్టీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నది సురేష్‌బాబు మాట. మరి ఎఫ్‌బీఐ విచారణలో ఇంకెన్ని విషయాలు, ఎంతమంది నటీనటులు బయటపడతారో చూడాలి.
 

click me!