‘కరోనా’పై పోరు: సుకుమార్ సాయం

By Surya PrakashFirst Published Mar 27, 2020, 2:55 PM IST
Highlights

లాక్‌డౌన్ కారణంగా రోజువారీ కూలీలు సహా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకొచ్చింది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. 
 

ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. లాక్‌డౌన్ కారణంగా రోజువారీ కూలీలు సహా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకొచ్చింది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. 

ఈ నేపధ్యంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ రెండు తెలుగు రాష్ట్రాలకు తన విరాళాలను ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విరాళంగా రూ.10 లక్షలు ప్రకటించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ‘కరోనా’ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు పోరాడే నిమిత్తం ఈ విరాళాలు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.  

అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి చేస్తోన్న పోరాటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతు సాయంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొత్తం రూ.1.25 కోట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకే కాకుండా కేరళ ప్రభుత్వానికి కూడా ఆయన అందజేయనున్నారు. 

ఇక  ప్రభాస్ తాజాగా ప్రధానమంత్రి సహాయనిధికి మూడు కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. దీంతో అతడు ప్రకటించిన విరాళం మొత్తం నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రభాస్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. 

అలాగే టాలీవుడ్ ప్రముఖులైన మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌, దిల్‌రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటి వారు తమ వంతు సాయం ప్రకటించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రభాస్ రెండుసార్లు సాయం ప్రకటించడం గమనార్హం.

click me!