సోనూ సూద్‌ మరో దాతృత్వం.. సిరిసిల్లా చిన్నారిని హార్ట్ ఆపరేషన్‌

By Aithagoni RajuFirst Published Nov 12, 2020, 10:45 AM IST
Highlights

సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకునేందుకు ముందుకొచ్చాడు. తాజాగా ఓ చిన్నారి హార్ట్ ఆపరేషన్‌కి ముందుకొచ్చాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాలుగు నెలల పసిబిడ్డ  వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా భరోసా ఇచ్చాడు. 

బాలీవుడ్‌ నటుడు, తెలుగు తెర విలన్‌ సోనూ సూద్‌ రియల్ హీరో అనిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ టైమ్‌లో, అంటే క్లిష్ట సమయంలో ఈ వెండితెర విలన్‌లో నుంచి అసలైన హీరో బయటకు వచ్చాడు. ఎంతో మందికి సాయం చేశాడు. ఆ తర్వాత కూడా తన సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఓ చిన్నారి హార్ట్ ఆపరేషన్‌కి ముందుకొచ్చాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాలుగు నెలల పసిబిడ్డ  వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా భరోసా ఇచ్చాడు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం, జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపెల్లిబాబు, రజిత దంపతుల కుమారుడు ఆద్విత్‌ శౌర్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తండ్రి పందిపెల్లి బాబు ఓ కొరియర్‌ సంస్థలో కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కుమారుడు అస్వస్థతకి గురవ్వడంతో పరీక్షించిన వైద్యులు, చికిత్స కోసం రూ.ఏడు లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీనస్థితిలో ఉన్న బాబు తన కుమారుడి వైద్యానికి సాయం అందించాలని సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా పేర్కొన్నాడు. 

తాజాగా దీనిపై నటుడు సోనూ సూద్‌ స్పందించారు. ఆద్విత్‌ శౌర్య ఆపరేషన్‌కి అయ్యే ఖర్చులో వీలైనంత మొత్తం భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇన్నోవా ఆసుపత్రిలో చిన్నారికి వైద్య చికిత్స చేయించాలని పేర్కొన్నాడు. ఆపరేషన్‌ డాక్టర్‌ కోన సాంబమూర్తి చేస్తారని సోనూసూద్‌ చెప్పినట్టు శౌర్య తండ్రి బాబు వెల్లడించాడు. అయితే ఏడు లక్షల్లో సోనూ సూద్‌ అధిక భాగం సోసూసూద్‌ చెల్లించనున్నాడు. ఇంకా రూ.1.5లక్షలు కావాలని, అంత డబ్బు తమ వద్ద లేదని, దాతలు ఆదుకుని తన కుమారునికి ప్రాణం పోయాలని బాబు వేడుకుంటున్నారు. దాతలు 80964 24621 నెంబర్‌కి సంప్రదించగలరని వేడుకుంటున్నారు. మరి ఇతర సెలబ్రిటీలుగానీ, కార్పొరేట్లు కాని స్పందించి బాబు కుమారుడికి అండగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు. 

click me!