మహేష్ ఈవెంట్ రద్దు.. శివాజీరాజా ఏమంటున్నాడంటే..?

Published : Dec 26, 2018, 04:50 PM ISTUpdated : Dec 26, 2018, 04:51 PM IST
మహేష్ ఈవెంట్ రద్దు.. శివాజీరాజా ఏమంటున్నాడంటే..?

సారాంశం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు అధ్యక్షుడు శివాజీరాజాపై ప్రధాన కార్యదర్శి నరేష్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు అధ్యక్షుడు శివాజీరాజాపై ప్రధాన కార్యదర్శి నరేష్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో టాలీవుడ్ పెద్దలు కలుగజేసుకొని విషయాన్ని సెటిల్ చేశారు.

అయినా ఇప్పటికీ ఈ వివాదంపై చాలా సందేహాలు మిగిలి ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీరాజా మరోసారి మా వివాదంపై కామెంట్స్ చేశారు. అమెరికాలో మహేష్ ఈవెంట్ ఎందుకు రద్దు చేయాల్సివచ్చిందని శివాజీరాజాని ప్రశ్నించగా.. ఆయన తాము బాధ పడినా పరవాలేదని, మహేష్ కి అమెరికాలో నిర్వాహకులకు ఇబ్బంది కలుగకూడదనే ఈవెంట్ రద్దు చేశామని తెలిపారు.

ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని కేసులు పెట్టుకొని జైలు పాలైతే.. ఈవెంట్ నిర్వాహకులు నష్టపోతారని ఆ కారణంగానే వెనక్కి తగినట్లు స్పష్టం చేశారు. కార్యదర్శి నరేష్ కి తనకు ఉన్న ఈగో సమస్యల కారణంగా ఇదంతా జరిగిందని,  ఇప్పుడు అంతా సర్దుకుందని అన్నారు.

'మా' అధ్యక్షుడిగా అర్ధరాత్రి ఫోన్ చేసినా ఆపద సమయంలో తన వెంట అసోసియేషన్ సభ్యులు వస్తారని అంతటి పేరు, మర్యాద తనకు చాలని అన్నారు. 'మా'లో గొడవలకి ఒక వ్యక్తే కారణమని, ఆయన రాజకీయాల్లో నుండి సినిమాల్లోకి వచ్చి బురద చల్లాడని, అతడి తల్లి మొహం చూసి వదిలేశామని సంచలన కామెంట్స్ చేశారు. ఆ వ్యక్తి ఎవరనే విషయం మాత్రం వెల్లడించలేదు.  

ఇవి కూడా చదవండి..

శివాజీరాజాపై చిరు గుస్సా.. మరి రాజీనామా చేస్తాడా..?

'మా' కాంట్రవర్సీ.. మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చేశాడు!

'మా' వివాదం.. చిరంజీవిని ఇరికిస్తున్నారా..?

ఆడపిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్లు వాళ్లు.. 'మా' వివాదంపై శ్రీరెడ్డి కామెంట్స్!

మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!

 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం